డయల్ 100 పోలీస్ డ్రైవర్లు అత్యవసర సమయంలో
ప్రజలు వినియోగించే కాల్స్ పట్ల వేగవంతమైన స్పందన తప్పక ఇవ్వాలి.
డయల్ 100 సిబ్బంది, ప్రజల పట్ల బాధ్యతగా మెలగాలి.
ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
అత్యవసర సమయంలో అందుబాటులో ఉండాలి
జిల్లా ఎస్.పి.
డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్.
ప్రజాబలం దినపత్రిక మెదక్ జిల్లా ప్రతినిధి
30.09.2024:
సోమవారం మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి. డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. జిల్లా బ్లూ కోట్స్ మరియు పెట్రో కార్ సిబ్బందితో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసి సిబ్బందికి పలు సూచనలు చేయడమైనది.
ఈ కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా ఎస్.పి.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. మాట్లాడుతూ.. డయల్ 100 అనగానే మొదటగా పోలీస్ ఏ గుర్తుకొస్తారని డయల్ 100 ఎమర్జెన్సీ సర్వీసెస్ ద్వారా ప్రజలను రక్షించడంలో పోలీసుల ఆధునిక సాంకేతికత పరిజ్ఞానం యొక్క సామర్థ్యానికి నిదర్శనం అని బ్లూ కోట్స్ మరియు పెట్రో కార్ సిబ్బంది 24 x7 ప్రజలలో ప్రజలతో ఉంటారు కాబట్టి ఎక్కడ ఏమి జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం అందించేలా ప్రజలతో సంబంధాలు పెంచుకోవాలని పోలీస్ అధికారులు, సిబ్బందికి సూచించారు. తద్వారా నేరాలను ముందే అంచనా వేసి నియంత్రించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ విజిబుల్ పోలీసింగ్‌ను మరింత పెంచాలని, శాంతి భద్రతలకు సంబంధించిన ప్రతీ అంశాన్ని ముందుగానే అంచనా వేయగలగాలని సూచించారు.
అలాగే డయల్ 100 కాల్ గాని ప్రజల వద్ద నుండి ఏదైనా అత్యవసర ఫోన్ కాల్ వచ్చినప్పుడు పోలీస్ పెట్రో కార్ డ్రైవర్లు అత్యవసర సమయంలో ప్రజలు వినియోగించే కాల్స్ పట్ల వేగవంతమైన స్పందన తప్పక ఇవ్వాలని తక్కువ సమయంలోనే సంఘటన స్థలానికి చేరి సేవలు అందించాలని, డయల్ 100 సిబ్బంది, ప్రజల పట్ల బాధ్యతగా మెలగాలని, అత్యవసర సమయంలో అందుబాటులో ఉండి, వాహనాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్.బి.సిఐ . సందీప్ రెడ్డి ,డీసీఆర్బీ సిఐ . మధుసూదన్ గౌడ్ , ఐటీ కోర్ టీం సిబ్బంది . అమర్ , బ్లూ కోట్స్ మరియు పెట్రో కార్ సిబ్బంది పాల్గొన్నారు.