కుమ్మరికుంట చెరువు భూమిపై సంయుక్త సర్వే జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 23 : మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్ పట్టణంలో గల కుమ్మరికుంట చెరువు భూమిపై సంబంధిత శాఖల అధికారులు సంయుక్త సర్వే నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు.వర్షాకాలంలో ఎడతెరపి లేకుండా కురిసే వర్షాలతో చెరువులోకి వరదనీరు చేరి సమీపంలోని వివిధ వార్డులలోకి ప్రవహించడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో నీటి పారుదల,రెవెన్యూ శాఖల,సమన్వయంతో సంయుక్త సర్వే నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.బఫర్ జోన్, ఎఫ్.టి.ఎల్.జోన్ పరిధిని విచారించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking