డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్
ప్రజాబలం మెదక్ జిల్లా ప్రతినిధి 23.09.2024:
సోమవారం జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయంలో .డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్ గారు మాట్లాడుతూ… ఈ నెల 28.09.2024 నాడు జిల్లా కోర్ట్ లో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ఉన్నదని కావున జాతీయ లోక్ అదాలత్ లో సామరస్య ధోరణితో రాజీ పడదగిన వివిధ కేసుల పై న్యాయ స్థానాల చుట్టూ తిరగకుండా కేసుల పరిష్కారం చేసుకోవాలని సూచించారు. అలాగే జాతీయ లోక్ అదాలత్ లో రాజీపడే అవకాశం ఉన్న కేసులను లిస్ట్ అవుట్ చేసుకోవాలని, రాజీ పడదగిన కేసుల్లో ఇరువర్గాల వారిని పిలిపించి చిన్నచిన్న కేసులతో జీవితాలు నాశనం చేసుకోవద్దని ఒకే గ్రామంలో ఉండే వారు ఎప్పుడూ కలిసి మెలిసి ఉంటారు కాబట్టి రాజీ మార్గమే రాజ మార్గమని వారికి అర్థమయ్యే విధంగా తెలపాలని జిల్లా సిబ్బందికి సూచించారు. అలా లిస్ట్ అవుట్ చేసిన కేసులలో అన్ని కేసులు రాజీ పడేటట్లు ప్రతి కోర్ట్ లైజనింగ్ ఆఫీసర్స్ మరియు కోర్ట్ కానిస్టేబుళ్లు మరియు సిబ్బంది కృషి చేయాలని తెలిపారు. అలాగే న్యాయశాఖ అధికారులతో సమన్వయం ఏర్పరచుకొని విధులు నిర్వహించాలని సూచించారు. జాతీయ లోక్ అదాలత్ లో సాధ్యమైనంత వరకు ఎక్కువ మొత్తంలో కేసులు రాజీ కుదిరేలా చూడాలని అన్నారు. కోర్టు విధులు నిర్వహించే ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి రాజీ కాదగ్గ కేసులలో రాజీ శాతం పెంచాలని సూచించారు. ఈ రాజీ కేసులు మెదక్ పట్టణంలోని 8వ అడిషనల్ జిల్లా సెషన్స్ జడ్జ్ కోర్ట్ ఆవరణలో ఈ నెల 28.09.2024 నాడు జాతీయ లోక్ అదాలత్ నిర్వహింపబడుతుందని అన్నారు.కావున ఈ అవకాశాన్ని రాజీ కాదగ్గ కేసులు ఉన్నవారు సద్వినియోగించుకోవాలని అన్నారు.