“ప్రజావాణిలో డి ఇ ఓ పై చర్య తీసుకోవాలని కలెక్టర్ కు వినతి”

 

సంగారెడ్డి సెప్టెంబర్ 23 ప్రజ బలం ప్రతినిధి:
కలెక్టర్ కార్యాలయంలో. ప్రజావాణిలో మునిపల్లి మండలంలోని ఉపాధ్యాయులు అక్రమ డిప్యూటేషన్ పద్ధతిలో, ఇతర మండలాలకు డి ఇ ఓ ఉత్తీర్లు ఇచ్చారు. వీటిని రద్దు పరచి డి ఇ ఓ పై చర్య తీసుకోవాలని తీన్మార్ మల్లన్న టీం ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి చేయడం జరిగింది. తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యుడు రమేష్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నిబంధన ప్రకారము. ఆ మండలాలలో విద్యార్థులకు అనుకూలంగా డిప్యూటేషన్ చేయాలి. కానీ జీవోను అడ్డుపెట్టుకొని అక్రమార్గంలో యుపిఎస్పిఎస్ నుండి సుమారు మునిపల్లి మండలం నుండి 6 మంది . ఉపాధ్యాయులు, గ్రామీణ ప్రాంతం నుండి సంగారెడ్డి అమీన్పూర్ పటాన్చెరు అర్ సి పురంకు అక్రమ బదిలీ చేయడం జరిగింది.. దీనిలో పెద్ద మొత్తము డబ్బులు చేతులు మారినట్టు తెలుస్తుంది.. మండల లోని ఒకవైపు ఉపాధ్యాయుల కొరత ఉండి. ఇప్పటికే మనసాన్ పల్లి పిఎస్, ఖమ్మం పల్లి యుపిఎస్ పాఠశాలలో మూతపడ్డాయి . యుపిఎస్ గార్లపల్లి ఇద్దరు ఉపాధ్యాయులు ఉండగా ఒక ఉపాధ్యాయుని ఆర్సిపురంకు పంపించడం జరిగింది. మరి ఆ పాఠశాల కూడా మూతపడతాయి. పిఎస్ తాటిపల్లి నుండి అక్రమంగా అమీన్పూర్ కు పంపడం జరిగింది.. ఇట్లా అనేక పాఠశాలలో ఈ విధంగానే ఇష్టం వచ్చినట్లు డిప్యూటేషన్ చేయడం వలన పాఠశాల లు మూతపడి విద్యార్థులు చదువు కోలేని పరిస్థితి వస్తుంది. కావున తక్షణమే ఈ విషయం పై చర్యలు తీసుకోగలరు.

Leave A Reply

Your email address will not be published.

Breaking