హైదరాబాద్ ఆగష్టు 26 ( ); ఈనెల 27 ఆదివారం రోజున మేడ్చల్ జిల్లా పీర్జాదీ గూడ లో ప్రభుత్వం కేటాయించిన స్థలములో చాత్తాద శ్రీవైష్ణవ భవన భూమి పూజ శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమానికి చాత్తాద శ్రీవైష్ణవ బంధువులందరు వేల సంఖ్యలో తరలి వచ్చి మన ఐఖ్యతను ,మన బలం బలగం ప్రభుత్వానికి చాటాలని తెలంగాణా చాత్తాద శ్రీవైష్ణవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అశ్వాపురం వేణుమాధవ్, ఉపాధ్యక్షులు టి.కేశవ కుమార్ లు పిలుపునిచ్చారు. ప్రముఖులతో వైభవంగా భవన నిర్మాణ భూమి పూజ జరుగునని తెలిపారు. ఈ భూమి పూజ శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి శంకుస్థాపన చేస్తారని వారు తెలిపారు అలాగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి టి పద్మారావు గౌడ్, కార్మిక శాఖ మంత్రి సిహెచ్ మల్లారెడ్డి, పశు సంవర్ధక శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, క్రీడల శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణ మోహన్ రావు తదితరులు హాజరవుతున్నట్లు తెలిపారు