వరంగల్ ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 20:
వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ది గాంచిన భద్రకాళి దేవస్థానాన్ని తెలంగాణా దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ దంపతులు సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన అనిల్ కుమార్ కి ఆలయ ఈ ఓ శేషు భారతి, ప్రధాన అర్చకులు భద్రకాళి శేషులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముందుగా వల్లభ గణపతిని దర్శించిన అనంతరం ఆలయంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ మహామండపంలో కమిషనర్ అనిల్ కుమార్, దంపతులకు ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు ఆద్వర్యమున ఆలయ అర్చకులు, వేద విద్యార్థులు మహాదాశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేషవస్త్రాలు బహుకరించి ప్రసాదములు ఆందచేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంట సుపెరింటెండింగ్ ఇంజనీర్ మల్లికార్జున రెడ్డి, దేవాదాయశాఖ వరంగల్ జోన్ ఉప కమిషనర్,టి శ్రీకాంతా రావు , అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత, డిప్యూటీ కమిషనర్ కార్యాలయ సూపరింటెండెంట్ ఎం వీరస్వామి, ఇన్స్పెక్టర్ సంజీవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.