జిల్లాస్థాయి సైన్స్ టాలెంట్ టెస్ట్ విజేతలకు అభినందనలు

 

వరంగల్ ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 20:

జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో, ఫిజిక్స్ బయాలజీ టీచర్ల ఫోరమ్ వరంగల్ జిల్లా శాఖ నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ టాలెంట్ టెస్ట్ మంగళవారం కృష్ణా కాలనీ లోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించారు. జిల్లాలోని పదమూడు మండలాల్లో జరిగిన మండలస్థాయి టెస్ట్ 17వ తారీఖు నాడు జరిగిన ఈ పోటీలలో మొదటి స్థానాల్లో నిలిచిన విద్యార్థులు జిల్లా స్థాయి లో పాల్గొన్నారు. పూర్తిగా ఆన్లైన్ పద్ధతి లో స్మార్ట్ ఫోన్ల ద్వారా జరిగిన ఈ ప్రతిభా పరీక్ష ను తెలంగాణ రాష్ట్ర ఫిజిక్స్ బయాలజీ టీచర్స్ ఫోరమ్స్ వారు ఏక కాలంలో అన్ని జిల్లాల్లో నిర్వహించగా ఈ పరీక్షలో 8వ తరగతి విభాగంలో ఖానాపూర్ మండలం అశోక్ నగర్ జెడ్పీ పాఠశాల విద్యార్థి బి గౌతం, 9వ తరగతి విభాగంలో కృష్ణాకాలనీ ప్రభుత్వ పాఠశాలకు చెందిన బి విష్ణువర్ధన్ సింగ్ విజేతలుగా నిలిచి 24వ తారీఖు జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ద్వితీయ, తృతీయ స్థానాలు ముదాసిర్ ( కృష్ణకాలనీ ప్రభుత్వ పాఠశాల), సిరిచందన (టీఎస్ఆర్ఎస్ నెక్కొండ), జశ్వంత్ (నర్సంపేట బాలుర జెడ్పీ పాఠశాల), తేజస్వి (వంచనగిరి మోడల్ స్కూల్) పొందారు. ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా సైన్స్ అధికారి డాక్టర్ కట్ల శ్రీనివాస్, కృష్ణా కాలనీ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంప అశోక్ కుమార్ గారు విజేతలకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. జిల్లా స్థాయి సైన్స్ టాలెంట్ టెస్ట్ ను సైన్స్ ఫోరమ్స్ బాధ్యులు, రిసోర్స్ పర్సన్స్ కిరణ్, సందీప్, అనంతగిరి, కృష్ణ, వేణు, ధనలక్ష్మి, రమేష్, విశ్వేశ్వర్, పరమేశ్వర్ లు విద్యార్థుల్లో జ్ఞాన నిర్మాణం జరిగే విధంగా నిర్వహించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking