ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు తీసుకోవలసిన చర్యలపై రెవెన్యూ, ఇరిగేషన్, భూగర్భ, మైనింగ్ శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా లో ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్మల్, సారంగాపూర్, దిలావార్ పూర్, సోన్, లక్ష్మణ చాంద మండలంలో అధికంగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని నియంత్రణ కు చర్యలు తీసుకోవాలన్నారు. రెవిన్యూ ల్, పంచాయతీ శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించి ఇసుకఅక్రమరవాణాచేసేవాహనాలను సీజ్ చేయాలనీ, ప్రభుత్వనిబంధనలమేరకు అపరాద రుసుమువిధించాలని సూచించారు. ఇసుక అవసరంఉన్నవారు సంబంధిత తహసీల్దార్ కార్యాలయాల నుండి అనుమతులు పొందాలని తెలిపారు. గ్రామ స్థాయిలో పంచాయతీ సెక్రెటరీ లు పర్యవేక్షించాలని, ప్రతిగ్రామంలో టాం టాం నిర్వహించాలని, నిబంధనలు అతిక్రమించేవారిపై కఠినచర్యలుతీసుకోవాలని ఆదేశించారు. అలాగే జనన, మరణ తదితర ధ్రువీకరణ పత్రాలను పెండింగ్ లో ఉంచకుండా నిర్దేశించిన సమయంలోగా జారీ చేయాలనీ సూచించారు. ధరణి, ప్రజావాణి, సీఎం ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని అన్నారు. అలాగే 27, 28 ప్యాకేజి లో భాగంగా చేపట్టిన భూసేకరణను వెంటనే పూర్తి చేయాలనీ సూచించారు. రోడ్లు భవనాలు, జాతీయ రహదారులకు సంబంధించి భూసేకరణ పనుల సత్వరం చేపట్టాలన్నారు. అనంతరం వివిధ రెవెన్యూ అంశాలపై మండలాల వారీగా చర్చించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, డిఆర్ ఓ, బి గంగయ్య, ఆర్డిఓ రత్న కళ్యాణి, ఎడి మైనింగ్ క్రాంతి కుమార్, తహసీల్దార్లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.