జమ్మికుంట ఫిబ్రవరి 20
సోషల్ మీడియాలో ఇతర వ్యక్తులపై అనుచిత వ్యాఖ్యలు గానీ అసత్యపు ప్రచారాలు గాని చేస్తే కఠిన చర్యలు తప్పవు అని జమ్మికుంట పట్టణ సీఐ వరగంటి రవి అన్నారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మూడవ వార్డులో జరిగిన ఘటనపై కొందరు కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తూ చట్టానికి వ్యతిరేకంగా అనవసరపు పోస్టులు పెడుతూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. ఇకపై ఎవరైనా ఇలాంటి అనవసరపు ప్రచారాలు చేస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి. ఇరు వర్గాల మధ్య జరిగిన సంఘటనను రాష్ట్ర మంత్రిపై రుద్దడం సరైనది కాదు అని, ఎవరైనా తప్పుడు పోస్టులు పెట్టిన అనవసరపు కామెంట్లు చేసిన చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అని, అనవసరమైన పోస్టులు పెట్టిన, ఫార్వర్డ్ చేసిన వారిపై, ఆ గ్రూప్ అడ్మిన్ పై చర్యలు తీసుకోబడతాయి కావున ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదని జమ్మికుంట పోలీస్ తరపున హెచ్చరించారు