భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి జనవరి 23 (ప్రజాబలం) కొత్తగూడెం వివాహం చేసుకుంటానని ఐదు సంవత్సరాలు సహా జీవనం చేసి. నేడు వేరే స్త్రీనీ పెళ్లి చేసుకొని నన్ను మోసం చేసిన సిడబ్యూసి యండి సాధిక్ పాషా పై చట్ట పరమైన చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయాలనీ కోరుతూ బోగా లక్ష్మి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కి పిర్యాదు ఇచ్చారు.నాకు 7 సం!క్రితం పరిచయమైన యండి సాదిక్ పాషా మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఐదు సంవత్సరాలుగా సహా జీవనం సాగిస్తున్నాడు.నీ భర్త చనిపోయాడు నీకు తోడూ లేదు.నాకు ఎవరు.పిల్లను ఇవ్వరు.ఇద్దరం కలిసి జీవిద్దాం.అంటూ చెప్పినాడు, నిజమే కదా అని నమ్మి ఆయనతో కలిసి జీవిస్తున్నాను.గత సంవత్సర కాలంగా వివాహం చేసుకొమ్మని ఒత్తిడి చేస్తున్నాను.సిడబ్యూసి ఎన్నిక అయ్యాక చేసుకుంటానని ఆశ పెట్టాడు. నేడు చైర్మన్ అయ్యాక పెళ్లి చేసుకుంటానని చెప్పి నాకు తెలియకుండానే దొంగ చాటుగా గుత్తుల ప్రసాద్ భార్య కన్నెపోగుల జన్నినీ పెళ్లి చేసుకున్నాడు.నన్ను లోబర్చుకుని.పెళ్లి చేసుకుంటానని చెప్పి వేరే మహిళతో సహాజీవనం చేస్తున్న సభ్యుడు యండి సాదిక్ పాషా పై చట్ట పరమైన చర్యలు తీసుకుని వెంటనే సస్పెండ్ చేసి నాకు న్యాయం చేయాలని వేడుకున్నారు.