జర్నలిస్టులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన ఇండ్లస్థలాల హామీని అమలు చేస్తాం

 

ఉమ్మడి జిల్లాలోని జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చే బాధ్యతను నా భుజస్కంధాలపై ఉంది

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ఖమ్మం ప్రతినిధి జనవరి 23 (ప్రజా బలం) ఖమ్మం సీఎం కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ నిండు భారీ బహిరంగసభ, మూడు రాష్ట్రాల సీఎంలు, లక్షలాదిమంది ప్రజల సమక్షంలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఒక్క నెలలో కేటాయిస్తామని, ఆ భరోసాను నాకు.. ఆర్థికశాఖమంత్రి తన్నీరు హరీష్ రావుకు అప్పగించిన ఇండ్ల స్థలాల కేటాయింపును పూర్తి చేసేందుకు కృషి చేస్తానని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు.
ఉమ్మడి జిల్లాలోని జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చే బాధ్యతను తన భుజస్కంధాలపైనే ఉందన్నారు. ఈనెల 18న జరిగిన బిఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగసభలో సీఎం కేసీఆర్ జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు కేటాయించాలని ఇచ్చిన హామీని ఖమ్మం జర్నలిస్టుల పక్షాన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృషి సల్పినందుకు గాను సోమవారం టీయూ డబ్ల్యూయుజె(టీజేఎఫ్) జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి చిర్రా రవిల ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఖమ్మం నగరంలోని విడివోఎస్ కాలనిలో ఉన్న మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను జర్నలిస్టులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి కృతఙ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులను ఉద్దేశించి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఇచ్చిన అస్యూరెన్స్ ను తూచా తప్పకుండా పాటించేందుకు ఆర్ధిక శాఖామంత్రి హరీష్ రావు సహకారంతో ఇండ్ల స్థలాల కేటాయింపు పూర్తిచేస్తామన్నారు. గతంలోనే జర్నలిస్టుల ఉమ్మడి బహిరంగసభలో, ప్రెస్ అకాడెమీ ఛైర్మెన్ సమక్షంలోనే ఇండ్ల స్థలాల సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని ఇచ్చిన హామీని గుర్తు చేశారు.

సీఎం కేసీఆర్ జర్నలిస్టులకు స్థలాల కేటాయింపులో ప్రభుత్వ స్థలం లేకపోతే, ప్రైవేట్ స్థలం కొనుగోలు చేసైనా ఇండ్ల స్థలాల ప్రక్రియను పూర్తి చేస్తామని స్పష్టంగా తెలియజేశారు. ఇంతహామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ కు మనం అందరం కృతజ్ఞతలు తెలపాలని సూచించారు. ఇప్పటికే జర్నలిస్టులకు అనువైన ప్రభుత్వ స్థలాన్ని చూడాలని ఉమ్మడి జిల్లా కలెక్టర్ లకు సూచించినట్లు తెలిపారు. ఖమ్మంలో ఉన్న జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చిన తర్వాత మిగతా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలకు మార్గదర్శకాలు ఇస్తానని తెలిపారు.

ఇండ్ల స్థలాల కేటాయింపులో న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తలతో ప్రణాలికను తయారు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రెస్ క్లబ్ స్థల కేటాయింపుతో పాటుగా నిర్మాణానికి నిధులు ఇచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

అనంతరం టీయూడబ్ల్యూయుజె(టీజేఎఫ్) జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ మాట్లాడుతూ… గత రెండు దశాబ్దాలుగా జర్నలిస్టులు ఎదురు చూస్తున్న ఇండ్ల స్థలాల కోరిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సహకారంతో నెరవేరుతున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూయుజె (టీజేఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్రా రవి టెంజూ జిల్లా అధ్యక్షులు రామకృష్ణ జిల్లా ఉపాధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి జానీ పాషా నగర అధ్యక్షులు బాలబత్తుల రాఘవ కార్యదర్శి అమరవరపు కోటేశ్వరరావు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు కొరకొప్పుల రాంబాబు టెంజూ నగర అధ్యక్షకార్యదర్శులు యలమందల జగదీష్ కరీష అశోక్ నాయకులు రాజేంద్రప్రసాద్ ముత్యాల కోటేశ్వరరావు టీఎస్ చక్రవర్తి బిక్కి గోపి బోయిన కృష్ణ పిన్ని సత్యనారాయాణ మోహన్ జక్కుల వెంకటరమణ యాదగిరి ప్రభాకర్ రెడ్డి కాసిం పానకాలరావు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking