బిఆర్ఎస్ కబ్జాలపై మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు

 

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి నవంబర్ 9

జమ్మికుంట పట్టణంలోని 30 వార్డులలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు అనేక భూకబ్జాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేత పత్తి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కు భూ కబ్జాలపై విచారణ చేపట్టవలసిందిగా వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా పత్తి కృష్ణారెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్, ఎమ్మెల్యే అండదండతో అడ్డు అదుపు లేకుండా ప్రభుత్వ భూములను ఆక్రమించారు. ఒక కౌన్సిలర్ భర్త రోడ్డుకు అడ్డంగా షెడ్డు నిర్మించి అదేమిటని ప్రశ్నించగా మున్సిపల్ సిబ్బందిపై దౌర్జన్యంతో దాడికి దిగి వాళ్లను భయభ్రాంతులకు గురి చేయడం ఇది ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. 647 సర్వే నంబర్ లో ఇంటి అనుమతులు పొంది మహిళా సంఘం స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. ఎమ్మెల్యే తన స్థాయిని మరిచి ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే వాటిని ఖండించినందుకు థర్డ్ క్లాస్ వ్యక్తులతో మాపై ఎదురుదాడికి దించుతున్నారని తీవ్రంగా ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సుంకరి రమేష్,సజ్జు, పూదరి రేణుకా శివ కుమార్, పార్లపల్లి నాగరాజు, మైస మహేందర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking