-మందమరి ఎస్సై రాజశేఖర్
ప్రజాబలం మందమర్రి మండల రిపోర్టర్ నవంబర్ 9
మీ మొబైల్ వాట్సప్ లకు వచ్చే గుర్తుతెలియని ఏపీకే అప్లికేషన్లను క్లిక్ చేయడం వల్ల సైబర్ నేరస్తుల వలలో చిక్కుకునే అవకాశం ఉందని మందమర్రి ఎస్సై రాజశేఖర్ అన్నారు.
మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో గల చిర్రకుంట గ్రామానికి చెందిన మాసినేని రాజేందర్ అనే వ్యక్తి వాట్సాప్ కి అక్టోబర్ 9న ఒక ఏపీకే ఫైల్ రాగా, అతను చూసుకోకుండా క్లిక్ చేయడంతో తన మొబైల్ పై అతను నియంత్రణ కోల్పోయి, అతనికి తెలియకుండానే తన బ్యాంక్ అకౌంట్ నుండి 50 వేల రూపాయలు పోయినట్టు తెలిపారు. అతనికి మెసేజ్ రాగా, వెంటనే అతను సైబర్ మోసానికి గురైనట్టు తెలుసుకొని, 1930 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి తన యొక్క ఫిర్యాదు నమోదు చేసుకున్నాడన్నారు.
ఈ ఫిర్యాదు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మందమరి ఎస్సై రాజశేఖర్ తెలిపారు.