……చవాన్ సుభాన్ సింగ్
ఎస్ సి ఎస్ టి ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఇచ్చిన హామీలను నెరవేర్చి – తక్షణమే వారిని రెగ్యులర్ చేయాలి, లేని పక్షంలో ఉద్యమాలు చేస్తాము.
….పెద్దాపురం దుర్గయ్య (జిల్లా అధ్యక్షులు)
సంగారెడ్డి డిసెంబర్ 27 ప్రజ బలం ప్రతినిధి:
నేటికీ 21 రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల కొరకుసంగారెడ్డి కలెక్టరేట్ వద్ద దీక్షలు చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంఘీభావంగా సమ్మే శిబిరానికి వచ్చిన సందర్బంగా చావాన్ సుభాన్ సింగ్ మాట్లాడుతూ ప్రభుత్వం చొరవ తీసుకొని వారికి బేసిక్ పే ఇవ్వాలని మరియు వారిని రెగ్యులర్ చేయాలనీ లేని పక్షంలో ఉద్యమాలు చేస్తామని చెప్పారు. టీచర్లకు వారదులుగా ఎం ఇ ఓ / డి ఇ ఓ లకు చాలా సేవలు అందిస్తున్నారని చెప్పారు. జిల్లా అధ్యక్షులు పెద్దాపురం దుర్గయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరo కావొస్తున్న ఇచ్చిన హామీలను నెరవేర్చా కుండా కాలయాపన చేస్తుంది అని అన్నారు. తక్షణమే వారిని రెగ్యులర్ చేసి వారికీ సమాన పనికి సమాన వేతనం అందించాలను డిమాండ్ చేశారు. గౌరవ అధ్యక్షులు లక్ష్మణ్ మాట్లాడుతూ మీ వెంట మేము ఉంటాము మీ న్యాయమైన డిమాండ్స్ అమలు కావాలన్నారు. అదనపు ప్రధాన కార్యదర్శి వసంత్ మాట్లాడుతూ డైలీ లేబర్ కంటే గోరంగా సమగ్ర ఉద్యోగులతో పనుచేస్తున్నారన్నారు, సమాన పనికి సమాన వేతనం పొందడం వారికి రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు.
అలాగే ఎస్ సి ఎస్ టి ఉపాధ్యాయ సంఘం సంగారెడ్డి జిల్లా తగరపున సమగ్ర ఉద్యోగులకు రు 3000/-అందించడం జరిగింది*. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కుర్రి చంద్రశేఖర్, జిల్లా గౌరవ అధ్యక్షులు లక్ష్మణ్, అదనపు ప్రధాన కార్యదర్శి వసంత్ కుమార్, కోశాధికారి ధర్మ పాల్గొని దీక్షలకు సంఘీభావం తెలిపారు