బాగేశ్వరరావు మృతికి నామ సంతాపం

 

ఫోన్ లో కుటుంబ సభ్యులకు పరామర్శ

ఖమ్మం ప్రతినిధి జూన్ 21 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ఆళ్లపాడు గోవిందాపురం గ్రామానికి చెందిన భాగం రమేష్ తండ్రి భాగం బాగేశ్వరరావు ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకున్న ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు శుక్రవారం ఫోన్ లో వారి కుటుంబ సభ్యులు రమేష్, తదితరులను పరామర్శించి, తన ప్రగాఢ సంతాప, సానుభూతిని వ్యక్తం చేశారు.దైర్యంగా ఉండాలని వారికి భరోసా కల్పించారు బాగేశ్వరరావు తో ఉన్న అనుబంధాన్ని చొరవను ఈ సందర్భంగా నామ గుర్తు చేసుకొని, బాధపడ్డారు. టీడీపీ లో ఉన్నప్పుడు ఆయనతో ఉన్న సహచర్యాన్ని మననం చేసుకున్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని దైవాన్ని ప్రార్ధించారు నామ నాగేశ్వరరావు

Leave A Reply

Your email address will not be published.

Breaking