నీట్ పరీక్ష లీకేజీకి బాధ్యులైన వారిపై విచారణ చేపట్టాలి డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు నిర్మల్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..నీట్ పరీక్ష లీకేజీకి బాధ్యులైన వారిపై సుప్రీం కోర్ట్ జడ్జి గారిచే విచారణ చేయించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు మాట్లాడుతూ.బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే లీకేజీ జరిగిందని.. ఒకే పరీక్షా కేంద్రంలో 8 మందికి టాప్ ర్యాంకు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతుందని మండిపడ్డారు. వెంటనే పరీక్షను రద్దు చేసి మళ్ళి నిర్వహించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ రత్న కల్యాణి గారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ ,ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి,ఎర్రవోతు రాజేందర్,టీపీసీసీ సభ్యులు సాద సుదర్శన్,పట్టణ అధ్యక్షుడు నాందేడపు చిన్నూ ,నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు