ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అను క్షణం పరితపించిన మహోన్నత వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు అన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో గల జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర సాధనకు విద్యార్ధి దశ నుండే ఉద్యమాలలలో చురుకుగా పాల్గొని ప్రజలను చైతన్య పరిచిన మహానీయుడని కొనియాడారు. తెలంగాణ సాధనను కళ్ళారా చూడాలని ఎంతగానే కోరుకుని చివరికి అది తీరేలోపే కన్నుమూశారని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రజల పితామహుడు జయశంకర్ సార్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలని కోరారు