ఇంటి ఇంటి సర్వే నిర్వహించి ఓటర్ల జాబితా సిద్ధం చేయాలి

 

మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం

నియోజకవర్గాల వారిగా నివేదికలు సమర్పించాలి

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సెప్టెంబర్ 11:
ఇంటి ఇంటి సర్వే నిర్వహించి ఓటర్ల జాబితాను సవరించి నియోజకవర్గాల వారిగా నివేదికలు సమర్పించాలని ఈ ఆర్ఓలను, ఎఈఆర్ఓలను మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం ఆదేశించారు.
బుధవారం మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ లోని విసి హాల్ లో ఈ ఆర్ఓలతో, ఎఈఆర్ఓలతో జిల్లా అదనపుకలెక్టరు విజయేందర్ రెడ్డితో కలిసి కలెక్టర్ గౌతం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ల జాబితను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయాలని తెలిపారు. డెత్ కేసులు, షిప్టెడ్ కేసులు ఏమైనా ఉంటే భారతీయ ఎలక్షన్ కమీషన్ మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ఒకే ఓటర్ పేరు రెండు సార్లు నమోదు అయితే ఓటర్ దగ్గర ఉన్న ఓటర్ ఐడి కార్డు ను పరిశీలించి అదనంగా ఉన్న ఐడి కార్డును తొలగించాలని కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో తహాసీల్దార్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking