ప్రభుత్వ భూములను గూగుల్ మ్యాప్లో నమోదు చేయాలి

మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సెప్టెంబర్ 11:ప్రభుత్వ భూములను గూగుల్ ఎర్త్ ద్వారా కె ఎంఎల్ మ్యాప్ రిపోర్టులను పంపాలని తహాసీల్దార్లను, సర్వేయర్లను మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం ఆదేశించారు.
బుధవారం మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ లోని విసి హాల్ లో ప్రభుత్వ భూములను గూగుల్ ఎర్త్ ద్వారా కె ఎంఎల్ మ్యాప్ పై అదనపు కలెక్టరు విజయేందర్ రెడ్డితో కలిసి కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ భూములను తప్పనిసరిగా గూగుల్ ఎర్త్ ద్వారా కె ఎంఎల్ మ్యాప్ రిపోర్టులను తయారు చేసి ఆర్డిఓల ఆమోదంతో పంపాలని తహాసీల్దార్లను, సర్వేయర్లను ఆదేశించారు. గ్రామాల వారీగా కె ఎంఎల్ మ్యాప్ రిపోర్టులను తయారు చేయాలని కలెక్టరు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డిఓలు, తహాసీల్దార్లు, సర్వేయర్లు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking