రాజి మార్గమే- రాజా మార్గం

 

నేషనల్ లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలి

ఈనెల -28 తేదీన నేషనల్ లోక్ అదాలత్ మెదక్, కోర్టు ప్రాంగణాలలో నిర్వహణ

ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యే విధంగా న్యాయవాదులు సహకరించాలి

కోర్టు ప్రాంగణము, మెదక్ లో ఇన్సూరెన్సు స్టాండింగ్ కౌన్సిల్స్, బ్యాంకు, చిట్ఫండ్స్ కౌన్సిల్స్ మరియు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్ మెంబర్స్ తో సమావేశం

ఛైర్పర్సన్ కమ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి,

జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, మెదక్ పి .లక్ష్మీ శారద

ప్రజాబలం -మెదక్ జిల్లా ప్రతినిధి
12.09.2024:

గురువారం గౌరవ ఛైర్పర్సన్ కమ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, మెదక్ శ్రీమతి P.లక్ష్మీ శారద కోర్టు ప్రాంగణము, మెదక్ లో ఇన్సూరెన్సు స్టాండింగ్ కౌన్సిల్స్, బ్యాంకు, చిట్ఫండ్స్ కౌన్సిల్స్ మరియు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్ మెంబర్స్ తో మీటింగ్ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తి లక్ష్మీ శారద మాట్లాడుతూ నేషనల్ లోక్ అదాలత్ తేది: 28.09.2024 రోజున జిల్లా కోర్ట్ ప్రాంగణం, మెదక్ నందు మరియు నర్సాపూర్ కోర్టు నందు నిర్వహించబడును అని ఇట్టి లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులను పరిష్కరించుకునే విధంగా న్యాయవాదులు సహకరించాలని కోరారు.
ఈ సదావకాశాన్ని ప్రజలు మరియు కక్షిదారులు వినియోగించుకుని ఎక్కువ మొత్తంలో కేసులను రాజీ కుదుర్చుకోవాలని మరియు ఇట్టి నేషనల్ లోక్ అదాలత్ ని విజయవంతం చేయాలని కోరారు.
ఇట్టి సమావేశంలో సి ఛ్ . జితేందర్ గారు, సెక్రటరీ కమ్ సీనియర్ సివిల్ జడ్జి మరియు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, మెదక్; మరియు ఇన్సూరెన్సు స్టాండింగ్ కౌన్సిల్స్; చిట్ఫండ్స్ కౌన్సిల్స్; బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్ మెంబర్స్; లేడీసీస్ అడ్వకేట్స్; ప్యానల్ లాయర్స్; రిటైనర్ లాయర్స్ మరియు ఇతర న్యాయవాదులు; కోర్టు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking