ప్రజాబలం మంచిర్యాల జిల్లా మార్చి 02 : రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ (సిఎపిఎఫ్)రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారులతో రామగుండం పోలీస్ కమిషనర్ ఐపిఎస్ (ఐజీ) ఎం.శ్రీనివాస్ బ్రీఫింగ్ సెషన్ సమావేశాన్ని నిర్వహించారు.పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన అన్ని విధుల్లో కేంద్ర బలగాలు రామగుండం కమిషనరేట్ పోలీసులతో కలిసి ఎన్నికల ముందు, పోలింగ్ రోజు,ఎన్నికల తరువాత, స్ట్రాంగ్ రూమ్ ల వద్ద, కౌంటింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నియంత్రించడమే లక్ష్యంగా, ఓటర్ల కు భయాందోళనలకు అవకాశం లేకుండా తమ ఓటు హక్కు ను స్వేచ్ఛ గా వేయడం లో భరోసా కల్పించడం లో భాగంగా ఫ్లాగా మార్చ్,రూట్ మార్చ్, బందోబస్త్ లు నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు.ఎన్నికల రోజు, ఎన్నికల తరువాత బందోబస్త్ విధులు నిర్వర్తించాలని, ఎన్నికల రోజుఎల్ (డబ్ల్యూఈ)పోలింగ్ స్టేషన్‌లు, క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లలో స్టాటిక్ బందోబస్త్ మరియు మిగతా ఫోర్స్ రూట్ బందోబస్త్ మరియు అత్యవసర పరిస్థితి సమయం లో విధులు నిర్వహించడం జరుగుతుంది అన్నారు.టీమ్స్ డ్యూటీ లు, ఎల్ డబ్ల్యూ ఈ ఏరియాలో ఏరియా డామినేషన్,కార్డెన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్, విధుల గురించి వారికి వివరించారు మరియు కీలకమైన పాయింట్‌ల వద్ద సెంట్రల్ ఫోర్స్ సిబ్బందిని ఉంచడం జరుగుతుంది అన్నారు.కేంద్ర బలగల ఉండడానికి సరైన వసతి ఏర్పాట్లు చేయాలని,వారితో కలిసి పనిచేయాలని ఏసీపీలను ఆదేశించారు. చెక్‌పోస్టుల వద్ద విధులు నిర్వర్తించే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలి అని సూచించారు.
పార్లమెంట్ ఎన్నికల భద్రతలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ కు ఐదు అందులో (02) సిఆర్ పిఎఫ్,(03) బీఎస్ఎఫ్ కంపెనీ బలగాలు రాగా అందులో మొత్తం అధికారులు, సిబ్బంది 443 రావడం జరిగింది.ఈ సమావేశం లో పెద్దపల్లి డీసీపీ చేతన ఐపిఎస్.మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్ ఐపిఎస్., అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు,సి ఆర్ పి ఎఫ్ అడిషనల్ కమాండెంట్ ఏ.కే పాండే, పరమానంద్ యాదవ్, బీఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్లు డేవిడ్ లాల్ తనసిమ్మ, భరత్ సింగ్, స్వరూప్ సమంత, డిప్యూటీ కమాండెంట్లు రతన్ లాల్,నరేష్ కెఆర్ షేరన్, ఏసీపీ లు పెద్దపల్లి జి. కృష్ణ, గోదావరిఖని ఏసీపీ రమేష్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు,ఏఆర్ ఏసీపీ లు ప్రతాప్,సురేంద్ర, మంచిర్యాల ఇన్స్పెక్టర్ బన్సీలాల్,బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలొద్దీన్ లు,సిబ్బంది పాల్గొన్నారు.