రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 21 మార్చ్ 2024: రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మహేందర్ గౌడ్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంకు గురువారం రోజున రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజన్ ఆర్డిఓ వెంకట్ రెడ్డి సమక్షంలో ఓటింగ్ జరిగింది, మేయర్ తో పాటు ఆయన వర్గం కార్పొరేటర్లు సమావేశానికి రానందున, ఓటింగ్ లో మేయర్ కు వ్యతిరేకంగా 16 మంది కార్పొరేటర్లు మద్దతు పలుకగా మహేందర్ గౌడ్ తన పదవిని కోల్పోవడం జరిగినది,

ఇప్పటికే మేయర్ మహేందర్ గౌడ్ తన అనుచర కార్పొరేటర్లందర్లతో కలసి కాంగ్రెస్ పార్టీలో చేరినను పదవిని దక్కించుకోలేక పోయినారని, మేయర్ పై అవిశ్వాస తీర్మాన బల నిరూపణ జరిపిన పిదప డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్ రెడ్డి మరియు 16 మంది కార్పొరేటర్లు ఏకగ్రీవంగా కార్పొరేటర్ లతా ప్రేమ్ గౌడ్ ని బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్ గా ఎన్నుకొవడం, 16 మంది కార్పొరేటర్ లతో కలసి లతా ప్రేమ్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ కో ఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వేర్ ని మర్యాదపూర్వకంగా కలవడం, చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వేర్ మేయర్కి, డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్ రెడ్డికి మరియు కార్పొరేటర్లకు శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
