ప్రజాబలం ప్రతినిధి హనుమకొండ జిల్లా డిసెంబర్15: వరంగల్ తూర్పు శాసన సభ్యురాలుగా నూతనంగా గెలుపొంది మంత్రి బాధ్యతలు చేపట్టిన కొండా సురేఖని శుక్రవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని కొండా నివాసంలో పరకాల మండలం కాంగ్రెస్ అధ్యక్షుడు కట్కూరి దేవేందర్ రెడ్డి, హనుమకొండ డిసీసీ చేనేత సెల్ చైర్మన్ దాసరి బిక్షపతి మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రాయపర్తి ఎంపీటీసీ పర్నెం మల్లారెడ్డి,చర్లపల్లి సర్పంచ్ చాడ తిరుపతి రెడ్డి,మల్లక్కపేట మాజీ సర్పంచ్ అల్లం రఘునారయాణ, పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంద నాగరాజు,సీనియర్ నాయకులు గుండెల్లి సదన్ కుమార్, కొండా యువజన సంఘం నాయకులు మాచబోయిన అజయ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.