చౌటుప్పల్ మార్చ్ 9 (); సృష్టికి మూలం అమ్మ అని, అమ్మలేనేది సృస్తి లేదని ,మానవ మనుగడకు అమ్మే మూలమని చండూరు ఎంపిపి పల్లే కల్యాణి రవి కుమార్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని చౌటుప్పల్ మండల కేంద్రంలో పాలకూర్ల శివయ్య గౌడ్ స్మారక ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమ్మలకు అభినందన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సమాజంలో మహిళల ఆరోగ్యంతోనే కుటుంబ సౌభాగ్యం ఏర్పడుతుందని, కుటుంబ సౌభాగ్యం తో దేశ సౌభాగ్యం ఏర్పడుతుందని చండూరు ఎంపిపి పల్లే కల్యాణి రవి కుమార్ అన్నారు. ఈ సందర్భంగా చిరు ఉద్యోగం, వ్యాపారాలు చేస్తూ తమ పిల్లలను చక్కగా చెరదీస్తున్న మహిళా మూర్తులకు అభినందన సన్మాన కార్యక్రమం | నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చండూరు ఎంపిపి పల్లె ఈ కల్యాణి రవి కుమార్ పాల్గొని 42 మంది ఆదర్శ మహిళలకు శాలువాలు కప్పి సన్మానించారు. పారిశుధ్య మహిళా కార్మికులకు అభినందోత్సవం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అవనిపై ఆని ముత్యాలు మహిళలు అని,కనిపించే దైవం అమ్మని కొనియాడారు. అనంతరం ప్రముఖ సాహితీ వేత్త బడుగు శ్రీరాములు మాట్లాడుతూ మహిళలు గౌరవించిన స్థలం సంపదలకు నిలయం అని, మహిళలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకుర్ల శివయ్య గౌడ్ స్మారక ||ఫౌండేషన్ చైర్మన్ మురళి గౌడ్, చౌటుప్పల్ మాజీ ఎంపిపి బొంగు జంగయ్య గౌడ్, తదితరులు పాల్గొన్నారు.