రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి ఆదరించాలి.
కుటుంబ పాలన సాగిస్తున్న కేసీఆర్ కు ఇవే చివరి ఎన్నికలు కావాలి*
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నిర్మల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అన్నారు.బుధవారం అదిలాబాద్ వెళ్తున్న ఆయనకు నిర్మల్ లో కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించి రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి, ఆదరించాలని కోరారు. ప్రజా సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వేర్వేరు కాదని, రెండు ఒక్కటేనని అన్నారు.రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి కుటుంబ పాలన సాగిస్తున్న కేసీఆర్ కు ఇవే చివరి ఎన్నికలు కావాలని పిలుపునిచ్చారు. ఇందులో ఉద్యమ నేత శ్రీహరి రావు, నాయకులు సాద సుదర్శన్,దశరథ రాజేశ్వర్,ఎంబడి రాజేశ్వర్,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాజిద్ అహ్మద్ ఖాన్, సబా కలీం, మజర్ అలీ ఖాన్.గాజుల రవి కుమార్ తదితరులున్నారు.