దాడులతో ప్రతి పక్షాన్ని అణిచివేయలేరు కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ నాగభూషణం

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 31 : దాడులతో ప్రతిపక్షాన్ని అణిచివేయలేరు.కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ నాగభూషణం హెచ్చరించారు.గురువారం పట్టణంలోని ఐ బీ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టణ,మండల కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఆరీఫ్ మాట్లాడుతూ…లక్షెట్టిపేట ను కొందరు బీఆర్ఎస్ నాయకులు దోచుకుంటున్నారని విమర్శించారు. ప్రజల పక్షాన నిలబడి అక్రమ మైనింగ్ పై ప్రశ్నించిన తమ యూత్ నాయకులు చిన్న వెంకటేష్, గుత్తికొండ శ్రీధర్ లపై దాడి చేసిన పోడేటి శ్రీనివాస్ గౌడ్ కు తగిన బుద్ధి చెబుతామన్నారు.అభివృద్ధి పనుల పేరుతో అక్రమ మైనింగ్ కు పాల్పడుతూ దాడులు చేస్తున్న వారిని కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. అంతకుముందు కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చల్ల నాగభూషణం మాట్లాడుతూ…దాడులతో ప్రతిపక్షాన్ని అణిచివేయలేరు,పోలీసులు,రెవెన్యూ అధికారుల అలసత్వం వలననే తమ పార్టీ నాయకులపై దాడులు జరుగుతున్నట్లు ఆరోపించారు.అధికారులు సక్రమంగా తమ విధులు నిర్వహిస్తే శాంతి భద్రతలు అదుపులో వుంటాయని వివరించారు.అందరి జాతకాలు తమకు తెలుసని,సహనం నశిస్తే తీవ్ర పరిణామాలు వుంటాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కాంగ్రెస్ పార్టీ చేయబట్టే లక్షేట్టిపేట్ కు ఆ 30 పడకల ఆసుపత్రి అయినా వచ్చిందంటూ బీ ఆర్ ఎస్ ను ఏద్దేవా చేశారు. నిజమైన అభివృద్ధి చేసినట్లయితే 100 పడకల ఆసుపత్రి ఎందుకు రాలేదని ప్రశ్నించారు? అంతకుముందు కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు రాందేని చిన్న వెంకటేష్ మాట్లాడుతూ…అక్రమ మొరం తవ్వకాలను అడ్డుకున్నందుకు అన్యాయంగా ప్రభుత్వ అధికారుల సమక్షంలో తమపై దాడి చేసినట్లు తెలిపారు.అనంతరం కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్తికొండ శ్రీధర్ మాట్లాడుతూ…. తనను కులం పేరుతో దూషించిన పోడేటి శ్రీనివాస్ అతని అనుచరులపై ఫిర్యాదు చేసి రెండు రోజులు గడిచిన ఇప్పటి వరకు పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదో అర్ధం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చింత అశోక్,మండల అధ్యక్షుడు పింగళి రమేష్,నాయకులు నలిమేల రాజు,రాందేని వెంకటేష్,అంకతి శ్రీనివాస్,నవాబ్ ఖాన్,బాణాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking