ఖమ్మం ప్రతినిధి మార్చి 10 (ప్రజాబలం) ఖమ్మం తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తుందని ఖమ్మం పార్లమెంట్ కాంటెస్ట్ అభ్యర్థి మైనార్టీ నేత “షేక్ మహమ్మద్ రసూల్” ఆరోపించారు తెలంగాణలో 14% ముస్లింలు వున్నా ఒక మంత్రి పదవి లేదు,రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ లేవు ఎమ్మెల్యేలు కోటాలో ఎమ్మెల్సీ పదవికి మరొకసారి ముస్లింలకు అన్యాయం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వారు ఉండటం వలన ముస్లిం మైనార్టీలకు పదవులు దక్కకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా తెలంగాణలో ఉన్న ముస్లిం మైనార్టీలు ఆలోచించాలని బిజెపి తొత్తులు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారని అది గ్రహించాలని అన్నారు. ఇప్పటికైనా ముస్లిం మైనార్టీ నాయకులందరూ ఏకతాటిపైకి రావాలని కోరారు