రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 11 మార్చి 2025
భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మణికొండకు విచ్చేసే సందర్భముగా భారత రాష్ట్ర సమితి మణికొండ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ ఆద్వర్యంలో నాయకులందరూ ఏకీకృత్తమై ల్యాంకో హిల్స్ విద్యుత్ శక్తి ఆఫీసు వద్ద ఆమెను సాధరముగా, సగౌరవంగా స్వాగతం పలుకుతూ గజమాలతో సత్కరించడం జరిగినది. తదనంతరం స్థానిక నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి అలకాపూర్ టౌన్షిప్ రోడ్ నెంబర్ 13 కు వెళ్ళి శస్త్ర చికిత్స అనంతరం కోలుకుంటున్న సీనియర్ బీ.ఆర్.ఎస్ నాయకుడు గట్టు రామచందర్ రావును వారి నివాసంలో కలిసి పరామర్శించడం జరిగినది. ఇట్టి సందర్భములో ఆమె మాట్లాడుతూ అధికారంలో ఉన్నా లేకున్నా బీ.ఆర్.ఎస్ పార్టీ ప్రతి నాయకుడు ప్రజా సంక్షేమం గురించి ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలియ పరుస్తూ, మణికొండలో మరీ ప్రత్యేకించి గుడ్ మార్నింగ్ నినాదంతో ప్రతి రోజూ ప్రజా క్షేత్రంలో ఉంటూ ప్రజల బాగోగులను తెలుసు కొంటూ ప్రాజభిప్రాయ సేకరణ గావిస్తున్నారణి, ఇదే మాదిరిగా ప్రజలతో మమేకమై ఏ ఎన్నికలు జరిగినా గులాబీ జండా రెప రెప లాడిస్తారని ఆశీస్తూ తన మనో సంకల్పాన్ని వ్యక్త పరిచారు, ఈ సమయంలో భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ, కుంభగల్ల ధనరాజ్, గుట్టమీది నరేందర్, రూప రెడ్డి, ఉపేందర్నాధ్ రెడ్డి, ముత్తంగి లక్ష్మయ్య, ఏర్పుల శ్రీకాంత్, సంఘం శ్రీకాంత్, కీర్తి లత గౌడ్, విజయ లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్, యాలాల కిరణ్, షేక్ ఆరిఫ్, కృష్ణ రాజీ, సుమనళిని, భానుచందర్, కందాడ ప్రవీణ్, బుద్దోల్ బాబు, మహేందర్, కృపాకర్, బొడ్డు శ్రీధర్, శ్రీనివాస్ చారి, శేఖర్, శివ, యుసేన్, తిరుపతి, మోనిష్, ప్రశాంత్, రామాంజనేయులు, రామకృష్ణ రెడ్డి, మధు చందన, బిందు, అనూష, అన్షు, సంధ్య, అన్నపూర్ణ, సాగర్, హరి, ప్రసాద్, రాధిక, ప్రియా, జ్యోతిలు పాల్గొన్నారు.
