రూ . 41.19 కోట్ల విలువ గల వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీధర్ బాబు
ఉప్పల్ ప్రజాబలం ప్రతినిధి:హైదరాబాద్, మార్చి 11: మౌలిక వసతుల కల్పనకు ప్రజాపాలన ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. మంగళవారం ఎల్బీనగర్ జోన్ ఉప్పల్ సర్కిల్ లో రూ. 4119. లక్షల విలువ గల వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డిలతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు.

రామంతపూర్ వార్డు ఇందిరా నగర్ మెట్ల గల్లి లో రూ. 88.80 లక్షల వ్యయంతో చేపట్టనున్న సివరేజ్, సి సి రోడ్డు పనులకు, కోటి రూపాయల వ్యయంతో రామంతపూర్ రజక సేవా సంఘం, అంబేద్కర్ సేవా సంఘం మొదటి అంతస్తు భవన నిర్మాణ పనులకు, బాలకృష్ణ నగర్, కె.టి.ఆర్ నగర్ లలో కోటి 20 లక్షల వ్యయంతో450/300 డయా సీవరేజ్ పైప్ లైన్ నిర్మాణ పనులకు, ఉప్పల్ భగాయత్ ఫేస్ 1 లో నీటి సరఫరా వ్యవస్థ, సీవరేజ్ సిస్టం పటిష్టత, మౌలిక వసతుల అభివృద్ధికి రూ. 25.43 కోట్ల వ్యయంతో చేపట్టనున్నపనులకు శంకుస్థాపన చేశారు.

రూ. 6.26 కోట్ల వ్యయంతో సూర్య నగర్, శ్రీరామ కాలనీ, లక్ష్మారెడ్డి కాలనీ, శేష సాయి నగర్, సౌత్ స్వరూప్ నగర్, స్వరూప్ నగర్, సత్య నగర్, టి.వి కాలనీ లలోసిసి రోడ్డు, రిటైనింగ్‌వాల్ నిర్మాణ పనులకు, ఉప్పల్ సర్కిల్ భరత్ నగర్ రామాలయం కాలనీ వద్ద రూ.1.52 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీవరేజ్ రీమోడలింగ్, స్ట్రామ్ వాటర్ డ్రైన్, సి సి రోడ్డు పనులకు, ఉప్పల్ సర్కిల్ డివిజన్ 14 లోని పద్మావతి కాలనీ, ఆనంద్ నగర్, సౌత్ స్వరూప్ నగర్, 7హిల్స్ కాలనీ, వెంకటేశ్వర కాలనీలో రూ. 4.88 కోట్ల వ్యయంతో ప్రస్తుత సీవరేజ్ లైన్లను రీమోడలింగ్ చేసేందుకు మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన లు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఉప్పల్ – నారపల్లిఫ్లైఓవర్ పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని, ఉప్పల్ నుండి ఘట్కేసర్ వరకు కొత్తగా ఐటీ కారిడార్ ఏర్పాటు చేస్తామని, హైదరాబాద్ నలుమూలలా మెట్రో రైలు, తీసుకువస్తామని, కాలుష్యం లేని బస్సులనుతీసుకువస్తామని మంత్రి తెలిపారు. మూసీ నది ప్రక్షాళన చేయడంతో పాటు మూసీ పరివాహక ప్రాంత ప్రజల సమస్యలు తీరుస్తామన్నారు. దేశంలో ఎక్కడాలేనివిధంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా కలెక్టర్‌గౌతం పొత్రు, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, స్థానిక కార్పొరేటర్లు రజిత, బండారు శ్రీవాణి, బొంతు శ్రీదేవి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.