ఎల్‌బీ నగర్ ప్రజాబలం ప్రతినిధి:హైదరాబాద్, మార్చి 11: దుర్గం చెరువు వద్ద చేపట్టిన స్ట్రామ్ వాటర్ డ్రెయిన్, ఎస్.ఎన్.డి.పి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులతో కలిసి దుర్గం చెరువు పరిసరాలను కమిషనర్ ఇలంబర్తి తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా చెరువు నిర్వహణ, వరద నీరు, మురుగు నీరు సమస్యలనుసమీక్షించారు. స్థానిక నివాసితులు, వాకర్లనుండి అభిప్రాయాలను సేకరించారు. వరద నీరు, మురుగు నీటి ప్రస్తుత పరిస్థితి ని ఎస్.డబ్ల్యూ.డి కన్సల్టెంట్, హెచ్.ఎం.డబ్ల్యు,ఎస్.ఎస్.బి ద్వారా సమగ్రంగా పరిశీలించినతర్వాత మురుగునీటి లైన్ల నిర్మాణాన్ని చేపట్టాలని లేక్స్ అడిషనల్ కమిషనర్ కు సూచించారు. హైటెన్షన్ కేబుల్ లైన్స్ వద్ద తగిన జాగ్రత్తలు తీసుకున్నతర్వాత ఎస్.ఎన్.డి.పి పనులను కొనసాగించాలనిసి.ఇ ని ఆదేశించారు. ట్రాఫిక్, అనుబంధ విభాగాలతో సమన్వయం చేసుకొనిపనులు పూర్తి చేయాలని శేరిలింగంపల్లి జోన్ కమిషనర్ కు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో లేక్స్ అడిషనల్ కమిషనర్ శివకుమార్ నాయుడు, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, ఎస్.ఎన్.డి.పి చీఫ్ ఇంజనీర్, ఎస్.ఇ మెయింటెనెన్స్ భాస్కర్ రెడ్డి, లేక్స్‌ఎగ్జిక్యూటివ్‌ఇంజనీర్, మెట్రోపాలిటన్ వాటర్ సప్లైఅండ్ సివరేజ్ బోర్డు డిప్యూటీ జనరల్ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు.