రిసెర్చ్‌ స్కాలర్‌ గా ఎంపికైన సాయిరాం కు అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే వేముల వీరేశం

నకిరేకల్‌ ప్రజాబలం ప్రతినిధి:నకిరేకల్‌ పట్టణానికి చెందిన గంజి సాయిరాం తమిళనాడు-చెన్నై నందు గల డాక్టర్‌ ఎంజీఆర్‌ ఎడ్యుకేషనల్‌ అండ్‌ రిసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ యూనివర్సిటి నందు పి.హెచ్‌.డి విద్యార్థిగా సోమవారం సాయంత్రం విడుదల చేసిన పలితాల్లో ఎంపికకాబడినందున ‘నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం మంగళవారం రోజున నకిరేకల్‌ పన్నాలగూడెంలోని తన క్యాంప్‌ కార్యాలయం నందు అభినందించారు. పిజికల్‌ ఎడ్యుకేషన్‌ నందు మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేసి, పిజికల్‌ ఎడ్యుకేషన్‌ విభాగంలో డాక్టర్‌ ఎంజీఆర్‌ ఎడ్యుకేషనల్‌ అండ్‌ రిసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ యూనివర్సిటి వారు నిర్వహించిన ప్రవేశపరీక్ష మరియు ప్రజంటేషన్‌ Ê ఇంటర్వ్యూ నందు ఉత్తమ ప్రతిభ కనబరచి ఎంపిక కావడం మరియు పిజికల్‌ ఎడ్యుకేషన్‌ మీద ఉన్న ఆసక్తితో అదే విభాగం నందు ఉన్నత చదువు కొనసాగించడం సంతోషించదగిన విషయం అని ఎమ్మెల్యే తెలిపారు. ఈకార్యక్రమంలో నాయకులు నకిరేకంటి ఏసుపాదం, నరేందర్‌, సుందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking