కంటి అద్దాలు అవసరమైన విద్యార్థులకు పంపిణీకి చర్యలు

 

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 11 : ప్రభుత్వ పాఠశాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులలో కంటి అద్దాలు అవసరమైన వారికి పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్నగర్ లో గల కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయంలో 20 మంది విద్యార్థులకు జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్, వైద్య అధికారులతో కలిసి కంటి అద్దాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలోని 568 పాఠశాలలు ఉండగా ఇందులో 164 రెసిడెన్షియల్ పాఠశాలలలో 8 ఆర్.బి.ఎస్.కె.బృందాల ద్వారా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి 1 వేయి 274 మంది విద్యార్థులకు కంటి సమస్యలు ఉన్నట్లుగా గుర్తించడం జరిగిందని తెలిపారు. వీరందరికీ కంటి వైద్య నిపుణులు డాక్టర్ యశ్వంత్ రావు, డాక్టర్ చంద్రబాన్, డాక్టర్ శిల్ప శ్రీ, ఆప్తాల్మిక్ అధికారులు శంకర్,భాస్కర్రెడ్డిల ద్వారా ఫిబ్రవరి నెలలో ప్రభుత్వాసుపత్రిలో తిరిగి పరీక్షలు నిర్వహించి అద్దాల కోసం వివరాలు పంపించడం జరిగిందని తెలిపారు.కంటి సమస్యలతో బాధపడుతున్న వారిని బృందాల ద్వారా గుర్తించి కంటి వైద్య నిపుణుల ద్వారా పరీక్షలు చేసి అద్దాలు పంపిణీ చేయడం జరిగిందని, కంటి అద్దాలను తప్పనిసరిగా వినియోగించాలని తెలిపారు.కంటి సమస్యలు రాకుండా ప్రతి ఒక్కరూ ఆహార అలవాట్లు మార్చుకోవాలని,ఏదైనా కంటి సమస్యలు ఉన్నట్లయితే ఆర్.బి.ఎస్.కె. బృందాల ద్వారా గుర్తించి ప్రభుత్వపరంగా చికిత్సలు పొందాలని తెలిపారు. ప్రతి ఆశ్రమ పాఠశాలలు, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, వాతావరణ మార్పులతో వచ్చే వ్యాధులు, వేసవికాలంలో వడదెబ్బ నుండి తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని, ఓ.ఆర్.ఎస్. ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. జిల్లాలోని 1 వేయి 241 మంది విద్యార్థులకు కంటి అద్దాలు అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ ఉప వైద్యాధికారి డాక్టర్ అనిత, జిల్లా అంధత్వ నివారణ అధికారి డాక్టర్ యశ్వంతరావు, వైద్యాధికారులు డాక్టర్ ప్రసాద్, డాక్టర్ కృపాబాయి, డాక్టర్ అశోక్, డాక్టర్ శ్వేత, మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు, పాఠశాల ప్రిన్సిపల్ స్వప్న, ఉపాధ్యాయులు, వైద్యాధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking