ఐకెపి-వివో ఏ లకు న్యాయం  జరిగే వరకు ఊరుకునేది లేదు-

 

 జాతీయ బీసీ సంక్షేమ సంఘం  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోవూరి సత్యనారాయణ గౌడ్

 సంగారెడ్డి ఏప్రిల్ 21 : ఇకపై ఏమాత్రం ఇందిరా గాంధీ  క్రాంతి పథకం  విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ లను  చిన్న చూపు చూసిన,  వారి సమస్యల పైన, డిమాండ్ల పైన  నిర్లక్ష్యం వహించిన  ఊరుకునేది లేదని  జాతీయ బీసీ సంక్షేమ సంఘం  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ హెచ్చరించారు.సదాశివపేట  మండలంలో ఇందిరా గాంధీ క్రాంతి పథకం విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు  నిర్వహిస్తున్న  నిరవరిక దీక్షకు మద్దతుఆయన సంఘిబావాన్ని ప్రకటించారు.ఈ సందర్బంగా  ఆయన  మాట్లాడుతూ  ఇందిరా గాంధీ క్రాంతి పథకం విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు  గత 20 సంవత్సరాలుగా  డ్వాక్రా గ్రూపు వాళ్లకు  మాత్రమే కాకుండా ప్రభుత్వం ఏ పని చెప్పినా  వెట్టి చాకిరి చేస్తూ  వారి యొక్క శ్రమను  ధారపోసినందుకు  ప్రభుత్వం ఇచ్చే జీతం  నెలకు  సుమారు 3000 రూపాయలు ఏం సరిపోతుందని ప్రశ్నించారు..  ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా  18,600 మంది  వి.వో.ఏ లు  రాష్ట్రవ్యాప్తంగా గత ఐదు రోజుల నుండి నిరవరిక దీక్ష  చేపడుతుంటే  ఏ ఒక్క ప్రజా నాయకుడికి కూడా కనికరం రావడం లేదా ,  వారి సమస్యలు వినపడడం లేదా కనపడడం లేదా అని మండిపడ్డారు.ప్రజలకు అనునిత్యం సేవలందిస్తున్నామని చెప్పుకునే బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు ఈరోజు  ఐ.కె.పి , వి.వో.ఏ  లకు  ఎందుకు మద్దతుగా నిలబడడం  లేరని  ప్రశ్నించారు. అదేవిధంగా   నాయకుడనేవాడు  ప్రజల సమస్యలను  పరిష్కరించడం కోసం ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి  ప్రజల పక్షాన నిలబడి   ప్రజా సమస్యలను పరిష్కరించేవాడు నిజమైన నాయకుడని నిరవరిక దీక్ష  సందర్భంగా తెలియజేశారు.  అవసరమైతే  18,600 మంది ఇందిరా గాంధీ  క్రాంతి పథకం విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ లతో  జాతీయ బీసీ సంక్షేమ సంఘం  అధ్యక్షులు,  రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో  తెలంగాణ అసెంబ్లీని ముట్టడి చేస్తామని సత్యనారాయణ గౌడ్  హెచ్చరించారు .  ఈ  ఐదవ రోజుకు చేరుకున్న నిరవరిక దీక్షలో  సదాశివపేట మండల  ఐ.కె.పి  అధ్యక్షులు సుధాకర్  మరియు  అధిక సంఖ్యలో విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking