మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 21 :
ప్రజాస్వామ్యం బ్రతకాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి రావాలని మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రశ్నించారు.శుక్రవారం స్థానిక విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ…బిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఏం చేసిందని,రైతు బందు పేరిట రూపాయి చూపిస్తూ నిత్యావసర ధరలతో నడ్డి విరుస్తుందని ఎద్దేవా చేశారు.గూడెం లిఫ్ట్ ద్వారా నష్టపోయిన రైతులకు ఈ ప్రభుత్వం ఏం చేసిందని రైతుల పొట్ట కొడుతూ శూనకానందం పొందుతుందన్నారు.వరద బాధితులను రోడ్డు మీద పడేసి స్కీమ్ ల పేరుతో భారీ స్కామ్ చేస్తున్నారన్నారు.ఫోటోలకు ఫోజలు ఇవ్వడం మానేసి వచ్చే ఎన్నికల్లో ప్రజలకు ఏమి సమాధానం చెప్తాడో దివాకర్ రావు ఆలోచించుకోవాలన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న పథకాలన్నీ ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించినవే అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వస్తే భూమి ఉండి ఇళ్లు లేని వారికి 5 లక్షల రూపాయలు,భూమి కూడా లేని వారికి కమ్యూనిటీ హోమ్ రూపం లో ఇళ్ల నిర్మాణాలు చేపడతామన్నారు.అంతే కాకుండా రైతులకు రైతు బందు తో పాటు జీవిత భీమా,కౌలు రైతులకు రైతు బంధు,రైతు కూలీలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తిస్తుందన్నారు.మహిళల సంక్షేమనికై కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి రాగానే మహిళా సంక్షేమనికై పెద్ద పీట వేస్తుందన్నారు.పెరిగిన నిత్యావసర ధరలు ప్రజలకు సరసమైనా ధరలలో అందించే విదంగా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.రైతుల వడ్లు తూకం సమయంలోనూ తూకం కట్టింగ్ లు,బార్ధన్ ఖరీదు,హమాలీ కూలీలు ఇవేవి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోలేదు ఇకముందు కూడా తీసుకోదు అన్నారు.రైతు రాజ్యమే కాంగ్రెస్ ప్రభుత్వం ఎజెండా అంటూ రైతులకు భరోసా కల్పించారు.రైతులకు వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం కాదు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.రైతులకు అన్యాయం జరిగితే ఊరుకొనేది లేదని హెచ్చరించారు.ప్రజలు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి పట్టం కట్టాలన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ది చెప్పి ఒక్క అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చి చూడండి అంటూ ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు చింత అశోక్ కుమార్,వైస్ ఎంపీపీ దేవేందర్ రెడ్డి,మండల అధ్యక్షుడు పింగళి రమేష్, మున్సిపల్ అధ్యక్షుడు ఎండి ఆరిఫ్,కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ చల్ల నాగభూషణం,దండేపల్లి వైస్ ఎంపీపీ కంది హేమలత సత్యం,దండెపల్లి ఎంపిటిసి ముత్యాల శ్రీనివాస్,గూడెం ఎంపిటిసి తోట మోహన్,కొండాపూర్ మణెమ్మ,నెల్కివెంకటపూర్, వనపర్తి మల్లిక రవి,ఎంపీటీసీ కొమ్ముగూడెం సందెల సురేష్,లక్షెట్టిపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమెల రాజు,యుత్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అంకతి శ్రీనివాస్,నాయకులు రాజేష్ ఎండి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.