తెలంగాణా రాష్ట్రంనుండి ప్రచురితమవుతున్న పత్రికలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అండగా నిలుస్తుంది: వీ.హనుమంతరావు

 

అంబర్‌పేట్‌ ప్రజాబలం ప్రతినిధి:తెలంగాణా రాష్ట్రం నుండి ప్రచురితమవుతున్న ప్రజాబలం తెలుగు దినపత్రిక 2024 క్యాలెండర్‌ను అంబర్‌పేట్‌ డిడి కాలనీలో సీనీయర్‌ కాంగ్రెస్‌ నాయకులు వి.హనుమంతరావు తన నివాసంలో ఆవిష్కరించడం జరిగినది.

ఈ సందర్భంగా వీ.హనుమంతరావు మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రంనుండి ప్రచురితమవుతున్న పత్రికలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలంగాణా రాష్ట్ర జర్నలిస్టుల సమస్యలను కాంగ్రెస్‌ ప్రభుత్వం పరిష్కరిస్తుందని తెలంగాణా రాష్ట్ర పత్రికలు మరియు జర్నలిస్టుల పట్ల సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా ఉన్నారని అని అన్నారు.

 

ఈ కార్యక్రమంలో ప్రజాబలం దినపత్రిక బ్యూరోఛీఫ్‌ డా॥ ఆర్పల్లి శ్రీనివాస్‌ కాంగ్రెస్‌ సీనీయర్‌ నాయకులు టీపీసీసీ ప్రధానకకార్యదర్శి లక్ష్మణ్‌ యాదవ్‌,టీపీసీసీ సెక్రటరీ శ్రీకాంత్‌ గౌడ్‌ ,

 

కాంగ్రెస్‌ సీనీయర్‌ నాయకులు బి.సతీష్‌గౌడ్‌,కాంగ్రెస్‌ సీనీయర్‌ నాయకులుపృథ్వీరాజ్‌, రాజు,సంజయ్‌ ,కొండల్‌రావ్‌ , చంద్రశేఖర్ తదితరులు పాల్గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking