ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..
నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండలం సిర్గాపూర్ నుండి నిర్మల్ పట్టణం మంచిర్యాల చౌరస్తా వరకు పాదయాత్ర కొనసాగింది దారి పొడుగునా ఏలేటి మహేశ్వర్ రెడ్డి కి ప్రజలు బ్రహ్మరథం పట్టారు సాయంత్రం నాలుగు గంటల నుండి ఈ పాదయాత్ర కొనసాగి 8.గంటల వరకు శివాజీ చౌక్ వరకు చేరుకుంది అక్కడ ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో కాంగ్రెస్ పార్టీ జాతీయ రాష్ట్ర నాయకులు మాట్లాడారు.
నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ యాత్ర
* నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి దేశాన్ని ఒకటి చేసిన రాహుల్ గాంధీ గారి సందేశాన్ని ఇంటింటికి చేరవేయడమే కాంగ్రెస్ పోరు యాత్ర లక్ష్యం
– మాణిక్ రావు ఠాక్రే..
* కేవలం మాయమాటలు చెప్పి అక్కడ కెసిఆర్ ఇక్కడ మంత్రి పదవులు అనుభవిస్తున్నారే కానీ ప్రజల కష్టాలను పట్టించుకున్నది లేదు. ఇలాంటి వారికి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది
– మహేశ్వర్ రెడ్డి..
* దేశంలో కుట్టిన రాజకీయ శక్తులు హిందువులను ముస్లింలను వేరు చేస్తూ ఓట్లు దండుకుంటున్నారు. సోనియమ్మ దయ తలచి ప్రత్యేక రాష్ట్రం ఇవ్వనట్లయితే తెరాస నాయకుల పరిస్థితి ఏంటి ఆలోచించండి.
– హనుమంత్ రావు..
* ఢిల్లీలో మోడీ తెలంగాణలో కేసీఆర్ ప్రజలను అణగదొక్కుతున్నారు. మోడీని ఓడించడం కేవలం కాంగ్రెస్ వల్లే సాధ్యం
– ఉత్తమ్ కుమార్..
* మైనార్టీలకు రిజర్వేషన్లు పేదలకు ఇల్లు బాసర త్రిబుల్ ఐటీ చివరకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే..
— దామోదర రాజ నరసింహ