దరఖాస్తులన్ని తీసుకోము..?

 

అంతా నా ఇష్టం..

ఆర్డీవో ఇన్వర్ద్ అధికారి నిర్వాకం

జగిత్యాల, మార్చి 6,(ప్రజాబలం ప్రతినిధి) సమస్యలను ఫిర్యాదు రూపంలో ఆర్డీవో కు విన్నవించుకొందామనుకొన్నా అదే కార్యాలయ ఇన్వర్ద్ అన్ని తీసుకొము..అంతా నా ఇష్టం అంటూ ప్రజా సమస్యలు అధికారులకు చేరకుండా అడ్డుకొంటున్న సంఘటన ఇది. జగిత్యాల ఆర్డీవో కార్యాలయ ఇన్వర్ద్ అధికారి వాస్తవ విధినిర్వహన ప్రతి దరఖాస్తు, ఫిర్యాదు ను తీసుకొని డూప్లికేటే పై రిసివుడ్ స్టాంప్ తో సంతకం చేసి ఇవ్వాలి. ఇలాగే విధినిర్వహన ఉండాలంటూ ఆర్డిఓ కార్యాలయ ఉన్నతాధికారుల అదేశాలున్నట్లు తెలిసింది. కానీ దీనికి భిన్నంగా ఇన్వర్ద్ అధికారి వ్యవహారంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదురుకొంటున్నట్లు తెలిసింది. ఏ దరఖాస్తు తెచ్చినా దానిపై పలువిధాలుగా ప్రశ్నిస్తూ, దరఖాస్తుదారులను తికమక పెడుతూ చివరకు ఈ దరఖాస్తును ఓ అధికారి పేరు చెప్పి అక్కడ ఇవ్వాలంటూ వెల్లగొడతాడన్నట్లు తెలిసింది. అన్ని సెక్షన్లకు, ఆర్డీవోకో ఇక్కడ ఇస్తేనే చేరేలా ఈ ఏర్పాటు కదా అని ప్రశ్నిస్తే వ్యంగ్య సమాదానాలతో దరఖాస్తు దారులను వెక్కిరిస్తాడన్నట్లు ప్రచారం జరుగుతోంది. డబుల్ బెడ్రూమ్ లో తమ పేర్లు రాలేదని ప్రజావాణిలో కలెక్టర్ ను కలిసిన దరఖాస్తుదారులను ఆర్డీవో కు దరఖాస్తులు అందించాలని కలెక్టర్ పురామయించినట్లు తెలిసింది. దీనితో భారీగా ఆర్డీవో కార్యాలయానికి వచ్చిన బాధితుల దరకాస్తులన్నింటిని తీసుకొనే బాధ్యత సదరు ఇన్వర్ద్ అధికారికి అప్పగిస్తే కొత్త సమస్యలు వచ్చేవని స్థానికంగా తెలిసింది. ఆర్డీవో ముందుచూపుతోనే ఒక తహసీల్దార్ తో దరఖాస్తుల స్వీకరణ చేపట్టి సమస్యను ప్రశాంతంగా ముగించినట్లు ఆర్డీవో సిబ్బందే అంటున్నారు. ప్రతిరోజు ఇన్వర్ద్ అధికారి మూలంగా దరఖాస్తు దారులకు ఇబ్బందులు తప్పడం లేదన్నట్లు తెలుస్తోంది. సోమవారం ఒక తహసీల్దార్ నిర్లక్ష్యంగా వ్యవహరించి కొందరు డబుల్ బెడ్రూం అర్హులకు అన్యాయం చేశాడని ఫిర్యాదు ఇవ్వడానికి వెళితే తీసుకోవడానికి నిరాకరించగా ఓ మీడియా పర్సన్ వెళ్లి ఇది తీసుకోవాలని కోరడం జరిగింది. తీసుకొను అని సమాధానం ఇవ్వగా, తీసుకోకుంటే న్యాయం ఎలా దొరుకుతుందని అడిగితే ఇంతే అంటూ ఇన్వర్ద్ అధికారి సమాదానం. ఇదే పేపర్ లో రాసుకోమంటారా అని అడిగితే.. ఏమైనా రాసుకపో అంటూ నిర్లక్ష్య సమాదానమే మీడియా ప్రతినిధికి ఎదురైంది. ఇలా ఓ మీడియా ప్రతినిదికే నిర్లక్ష్యం ఎదురైతే ఇక సామాన్య ప్రజానీకానికి ఆర్డీఓ కార్యాలయం ద్వారా న్యాయం దొరుకుతుందా అన్న అనుమానాన్ని స్థానికంగా ఉన్న ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు చెల్లించే పనులతో వేతనాలు పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగుల్లో విద్యుక్త ధర్మం అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత ఆర్డీవోపై, జిల్లా కలెక్టర్ పై ఉందని ఆ దిశగా దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking