కాంగ్రెస్‌ నాయకులు ఎస్‌. వినోద్‌ కుమార్‌ కి ఘోర రోడ్‌ ప్రమాదం…

ఎలాంటి ప్రాణాపాయం లేకుండా క్షేమంగా బయటపడ్డారు
మహబూబ్‌నగర్‌ ప్రజాబలం ప్రతినిధి: బుధవారం 30/7/2025 నాడు గద్వాల జిల్లా కోర్టులో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మరియు ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కుమార్‌ మరియు కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలపై బి. ఆర్‌.ఎస్‌. పార్టీ పెట్టిన అక్రమ కేసుపై వాదించుటకు గద్వాల జిల్లా కోర్టుకు వెళ్లి అనంతరం గద్వాల కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు గంజిపేట లక్ష్మణ్‌ కాంగ్రెస్‌ పార్టీపై అసంతృప్తిగా ఉన్నారని తెలియగానే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కుమార్‌ తో పాటు గంజిపేట లక్ష్మణ్‌ ఇంటికి వెళ్లి మాట్లాడి పార్టీని వదిలి వెళ్లొద్దని ఒప్పించి, సాయంత్రం తిరుగుప్రాయణంలో మహబూబ్‌ నగర్‌ వస్తుండగా కనిమెట్ట గ్రామం దగ్గర ఒక పెద్ద కంటైనర్‌ లారీ వచ్చి వినోద్‌ కుమార్‌ ఇన్నోవా క్రిస్ట కారును ఢీకొట్టడం జరిగింది. ఈ యొక్క ఘోర రోడ్డు ప్రమాదంలో మన ప్రియతమా నాయకులు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మరియు సీనియర్‌ న్యాయవాది ఎస్‌.వినోద్‌ కుమార్‌ భగవంతుని దయవల్ల ఎలాంటి ప్రాణాపాయం లేకుండా క్షేమంగా బయటపడ్డారు…

   

Leave A Reply

Your email address will not be published.

Breaking