👉 అందోల్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో ముఖాముఖి సమావేశం
👉 నిర్వహించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ
అందోల్ నియోజకవర్గం ప్రతినిధి (జూలై 31 ప్రజాబలం) సంగారెడ్డి జిల్లా : అందోల్ నియోజకవర్గం లో, ఆగస్టు 1 2 తేదీలలో , (ఏఐసీసీ ) తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్, మీనాక్షి నటరాజన్, పర్యటనను విజయవంతం చేయటంపై, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, దామోదర్ రాజనర్సింహ, క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను, కార్యకర్తలతో కలిసి పరిశీలించారు( ఏఐసీసీ ) తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి, మీనాక్షి నటరాజన్, పర్యటనలో భాగంగా, చేపట్టనున్న పాదయాత్రలో పాల్గొనేందుకు, పెద్ద ఎత్తున తరలివస్తున్న కార్యకర్తలకు అవసరమైన ఏర్పాట్ల ను మంత్రి దామోదర్ రాజనర్సింహ పరిశీలించారు, అందోల్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంను పరిశీలించారు, మీనాక్షి నటరాజన్ పర్యటనలో, ఆగస్టు 2 న, అందోల్ పట్టణంలో నిర్వహించే, శ్రమదానం కార్యక్రమం, ఏర్పాట్లు కార్యకర్తలతో ముఖాముఖి సమావేశం ఏర్పాట్లపై ముఖ్య నాయకులతో చర్చించారు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అందుకు అవసరమైన ఏర్పాటు చేయాలని, మంత్రి ముఖ్య నాయకులను కోరారు, ఈ కార్యక్రమంలో పిసిసి ఉపాధ్యక్షుడు సంగమేశ్వర్, ముఖ్య నాయకులు సురేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మక్త, జగన్ మోహన్ రెడ్డి, మార్కిఫైడ్ డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు, డాకూర్ మధుసూదన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లయ్య,నరేందర్ రెడ్డి, మాజీ కావున్సిల్లరు చిట్టి బాబు, సత్యనారాయణ, శంకర్, యువ నాయకులు, పృథ్వి రెడ్డి,వినయ్ గౌడ్, ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..
