429 జీవో వెంటనే అమలు చేయాలి నేతి రాజేశ్వరరావు
కామారెడ్డి జిల్లా, (ప్రజాబలం ప్రతినిధి) కామరెడ్డి జిల్లాలోని ఆర్‌ఎంపీ, పిఎంపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేయించిన రాష్ట్ర అధ్యక్షులు నేతి రాజేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణలో అతిపెద్ద జిల్లా అయినా కామరెడ్డి లో ఇప్పటివరకు ఆర్.ఎం.పి , పి.ఎం.పి అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేరని నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన విఠల్ ప్రతి మండలాన్ని తిరిగి సంఘాన్ని అన్ని వేళల సేవలు అందిస్తానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేసేది ఏమనగా రాష్ట్ర మొత్తం ఆర్‌ఎంపీలు, పీఎంపీలు 50 వేల నుండి 60 వేల వరకు ఉన్నారని. 429 జీవో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చారని వాటిని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మా ఆర్.ఎం.పి, పి.ఎం.పి డాక్టర్లకు ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు అధికారులు ఎన్ ఎం సి వాళ్ళను అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఐఎంఏ వాళ్ళు అంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరి హెల్త్ డిపార్ట్మెంట్ అంటే ఔషధ నియంత్రణ శాఖ , ల్యాండ్ రెవెన్యూ అధికారులు అందరూ ఆర్.ఎం.పి , పి.ఎం.పి డాక్టర్లను ఏదో ఒక విధంగా ఎన్‌ఎంసి ఉన్నటువంటి ఏదో ఒక జీవోను పట్టుకొని వచ్చి ఆర్‌ఎంపీలకు, పీఎంపీలకు ఎలాంటి అనుమతులు లేవని . మా మిత్రులను అరెస్టు చేస్తున్నారు, వాళ్ళను బెదిరిస్తున్నారు, వాళ్లపై కేసులు పెడుతున్నారు వెంటనే కేసులను, ఎఫ్ ఐ ఆర్ ను తీసేయాలని, వాటిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు పోవడం జరిగిందని రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి మీకు ఎలాంటి సమస్యలున్న చెప్పండి అని అన్నారని. ప్రతి ఊరిలో గుడి బడి ఉన్నదో లేదో తెలియదు కానీ ప్రతి ఆర్.ఎం.పీ, పి.ఎం.పి డాక్టర్ ఉన్నారు. ప్రతి ఊర్లో ఆర్.ఎం.పీ, పి.ఎం.పి డాక్టర్లకు సాధక బాధాకలు తెలుసని. ఒక కార్పొరేట్ హాస్పిటల్ లో వైద్యము చేసుకున్న తర్వాత డాక్టర్ రాసిన ఇంజక్షన్లు ఎవరిస్తారు ఎంబిబిఎస్ డాక్టర్ వచ్చి ఇస్తారా. పల్లెటూర్లలో రాత్రి 12 గంటల తేలు ,పాము కాటు వేసినప్పుడు ఎంబిబిఎస్ డాక్టర్ వస్తారా ఉన్న హాస్పిటల్లో వైద్యం చేయడానికి ఇలా వచ్చి అలా వెళ్తారు . రాష్ట్ర మొత్తము ఒక్కొక్క పల్లెటూర్లలో ఎంబిబిఎస్ డాక్టర్లు నియమించండి వెంటనే మా ఆర్.ఎం.పి, పి.ఎం.పి డాక్టర్లు విరమించుకుంటారు, అలా విరవించుకోవాలంటే నెలకు 50 వేల జీతభత్యాల , 50 లక్షలు ఇన్సూరెన్స్ ,డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చి నెలకు 50 వేల జీతాలు ఇస్తే అప్పుడు తప్పకుండా బంద్ చేస్తాం. మేము ఎలాంటి ధర్నాలు చేయడం లేదు, డిమాండ్ చేయడం లేదు , జీతాలు అడగలేదు బోనస్ లు అడగలేము మా జీవో ఒకటి రెన్యువల్ చేయమని చెబుతున్నాం. మేము ఒక్క రోజుకు 50 వేల మందికి ట్రీట్మెంట్ చేస్తున్నారు అని ఉదాహరణగా చెప్తున్నారు. వారికి నేను ఒకటే విన్నవించుకుంటున్నాను ఇలా వైద్యం చేసుకున్న వారు ఎంతమంది చనిపోయారు . మాకు అవగాహన లేదు అనడం సరైనది కాదని, అవగాహన లేనిది 50 సంవత్సరాలు నుంచి వైద్యం చేస్తున్నారా ఎంబిబిఎస్ డాక్టర్లు కూడా అనుభవం లేనిదే వైద్యం చేస్తున్నారా ఎంబిబిఎస్ ఇచ్చే ఇంజక్షన్లే ఆర్‌ఎంపీ, పీఎంపీ డాక్టర్లు ఇస్తారు రోగి స్థితిగతులను అర్థం చేసుకొని వైద్యం చేయడం మంచిదని అన్నారు . రోగి పరిస్థితిలు అర్థం కానిచో మీరు ఇచ్చిన మేమిచ్చినా ఒక్కడే విధంగా ఉంటుందని ఆయన అన్నారు. మేము ఇస్తేనే చనిపోవడం అనడం సరేనా సమాధానం కాదని అనుభవం లేని ఏ ఒక్క డాక్టర్ కూడా వైద్యం చేయలేదని ఒకవేళ అలా చేసినచో మా యూనియన్ తరపున పోలీస్ స్టేషన్ కి వచ్చే మేమే తీసేస్తాం. అంతేగాని మీరు 50 మంది దొంగ డాక్టర్లు ఉన్నారని వీళ్లకు వైద్యం చేయరాదని ఇలా అనడం సరైనది కాదని 50 వేల మంది ఆర్‌ఎంపీ, పిఎంపి డాక్టర్లను కాపాడాలని ముఖ్యమంత్రి కోరడం జరిగిందని వారు మనకు సమయం ఇచ్చారు కానీ తొందరగా మాకు సమయం ఇవ్వాలని కోరుకుంటున్నాం . ఈ కార్యక్రమానికి రాష్ట్ర, జిల్లా , పట్టణ ఆర్‌ఎంపీ, పి ఎం పి డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు
Next Post