త్రీ టౌన్ కే వి పీ ఎస్ కమిటీ ఎన్నిక

 

పాల్గొన్న జిల్లా అధ్యక్షులు ముత్తమాల ప్రసాద్, కార్యదర్శి నందిపాటి మనోహర్ ఉపాధ్యక్షులు పాపాపిట్ల సత్యనారాయణ

 

ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 03 (ప్రజాబలం)ఖమ్మం దళిత హక్కులకు భంగం కలిగితే దాడులకు దిగితే సహించం. కెవిపిఎస్ నాయకులు జెండాను ఆవిష్కరించిన సీనియర్ నాయకులు మండల వీరస్వామి అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు, రుణాలు ఇవ్వాలి అన్ని దళిత వాడలల్లో మౌలిక సదుపాయాలు రోడ్లు మంచినీరు వీధి దీపాలు సౌకర్యం కల్పించాలి దళితుల వాడల్లో కమ్యూనిటీ హాల్ నిర్మించాలి స్మశాన వాటికలకు స్థలం కేటాయించాలి .మండల అధికారులు విధిగా నెలకు ఒకసారి దళిత వాడలను సందర్శించి సమావేశాలు నిర్వహించాలి

3టౌన్ ఏరియా కెవిపిస్ మహాసభ డిమాండ్

పలువురు వక్తలు మాటలాడుతూ కెవిపిఎస్ ఉద్యమం ఫలితంగా ఎస్సీ సబ్ ప్లాన్ చట్టం వచ్చిందని దీనికి కేటాయించిన నిధులు సక్రమంగా వినియోగించలేదని చాలా నిధులు పక్క దారి అయ్యాయని వీటిపై విచారణ జరిపించాలని ఇకనైనా దళితులకు కేటాయించిన నిధులు దళితులకే ఖర్చు చేయాలని బడ్జెట్లో దళితుల వాటా పెంచాలని డిమాండ్ చేసినారు స్వాతంత్రం వచ్చి అనేక సంవత్సరాలు గడిచిన ఇంకా అభివృద్ధికి నోచుకోలేని స్థితిలో దళితులు ఉన్నారని ఇంకా వివక్ష, కుల అహంకార దాడులు జరుగు తున్నాయని గ్రామీణ ప్రాంతాలలో గ్రామ బహిష్కరణ చేస్తున్నారని కుల వివక్షత రూపుమాపాలని అందరికీ విద్య వైద్య సౌకర్యాలు కల్పించాలని జరుగుతున్న లోపాలు సరిచేసి, తగు సౌకర్యాలు కల్పించాలని కేఏపీఎస్ 3 టౌన్ మహాసభ డిమాండ్ చేసినది ఈ సభకు నాయకులు ఎస్ కే సైదులు భద్రయ్య అధ్యక్షులు భాగంగా వ్యవహరించినారు గిరిజన సంఘ నాయకులు భూక్య శ్రీను, సిఐటియు నాయకులు బండారు యాకయ్య, బిల్డింగ్ వర్కర్ నాయకులు మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు త్రీ టౌన్ ఏరియా మున్నేరు వరదలకు గురి అయిన ప్రాంతాలు ఉన్నాయని వారికి ఇండ్లు సౌకర్యం కల్పించాలని, ఇంకా కొన్ని ప్రాంతాలు మురుగనీటిలో ఉన్నాయని తక్షణం మున్సిపల్ అధికారులు సర్వే జరిపి ఆదుకోవాలని డిమాండ్ చేసినారు అనంతరం కమిటీ ఎన్నిక జరిగినది గౌరవ అధ్యక్షులుగా ఎస్.కే. సైదులు అధ్యక్షులుగా సరికొండ రాంబాబు కార్యదర్శిగా ఏచ్చు వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షులుగా రాంబాబు రాము భద్రయ్య, జగదీష్, రాజు ,నరేష్, సహాయ కార్యదర్శులుగా చంద్రశేఖర్ వెంకటరమణ లత శ్రీను కమిటీ సభ్యులుగా మాలతి మల్సూర్ ఉపేందర్ వెంకన్న రమాదేవి కుమారి నాగయ్య రామకృష్ణ స్వామి చాందిని ఎన్నికైన అయినారు

               

Leave A Reply

Your email address will not be published.

Breaking