కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ ను భారీ మెజార్టీ గెలిపించాలని కొర్విచెల్మ కాంగ్రెస్ నాయకులు
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 11 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని కొర్విచెల్మ గ్రామంలో పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.శనివారం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు గ్రామంలో వాడవాడలో ప్రతి ఇంటికి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ ను భారీ మెజార్టీ గెలిపించాలని ప్రజలను కోరారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ…పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ ను భారీ మెజార్టీ గెలిపించాలని ప్రజల వద్దకు వెళ్ళి కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముధ్దసాని గణపతి,కారుకూరి బాలయ్య,సత్తయ్య, అప్పని సత్తయ్య,దొడ మధుకర్,పిసరి సత్తయ్య, మల్యాల కిష్టయ్య, వెంకటేష్,కొక్కిస రమేష్, ప్రసాద్,సుద్దపల్లి వేంకటేష్, పొచయ్య,మురుమడుగుల శ్రీనివాస్,సౌటపల్లి లచ్చన్న తదితరులు పాల్గొన్నారు.