ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..
సభా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపిన డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు.
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 17 లోక్సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా టీపీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యాచరణ ప్రారంభించారు. ఇందులో భాగంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం ఇంద్రవెల్లిలో వచ్చేనెల ఫిబ్రవరి రెండున భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేస్తున్నారు.ఇంద్రవెల్లి సభ నుండి పార్లమెంట్ ఎన్నికల శెంకారావాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూరిస్తారని తెలిపారు. సీఎం సభకు భారీగా జన సమీకరణ చేస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి లక్ష మందికి పైగా ప్రజలు హాజరయ్యేలా కార్యాచరణ సిద్ధం చేస్తునట్లు పేర్కొన్నారు