జాతిపితకు ఘన నివాళులు

 

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జనవరి 30:
దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన త్యాగధనులను స్మరించుకుంటూ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, నేతృత్వంలో సంస్మరణ దినోత్సవం నిర్వహించారు.ఈ సందర్భముగా అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొని స్వాతంత్రోద్యమ అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అమరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్తామనే ధృడ సంకల్పంతో, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.
ఈ కార్యక్రమం లో జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది , తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking