అనారోగ్యంతో మరణించిన కుటుంబ పరామర్శించిన ఆర్థిక సహాయం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కంది సత్తీష్
ప్రజాబలం దండేపల్లి మండల రిపోర్టర్ అక్టోబర్ 29 : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట్ గ్రామం కు చెందిన బూతగడ్డ భారతి అనే నిరుపేద మహిళ వారం రోజుల కిందట అనారోగ్యం తో మరణించగా మంగళవారం రోజున దండేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కంది సతీష్ కుమార్ మృతురాలి కుటుంబ సబ్యులను పరామర్శించి,వారికి 3000 వేల రూపాయల విలువగల నిత్యావసర సరుకులు అందజేసారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అడై కాంతారావు,స్థానిక నాయకులు గోపతి లక్ష్మయ్య,కొంపల రవీందర్, వేమునూరి సత్యం,జాఫర్ ఖాన్,యువ నాయకులు బెల్లపుకొండ అన్వేష్ మరియు దొమ్మాటి లచవ్వ తదితరులు పాల్గొన్నారు.