ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి అక్టోబర్ 29 : మంచిర్యాల నూతన ఆర్డీవో గూడూరి శ్రీనివాస్ రావు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.ఇప్పటి వరకు ఇక్కడ విధులు నిర్వహించిన వి.రాములు నిర్మల్ సబ్ కలెక్టర్ గా బదిలీ కాగా ఆయన స్థానంలో శ్రీనివాస్ రావు ను ప్రభుత్వం నియమించింది. బాధ్యతలు స్వీకరించిన ఆర్డీవో శ్రీనివాస్ రావును రెవెన్యూ అధికారులు, కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు.