ప్రజాబలం దండేపల్లి మండల రిపోర్టర్ అక్టోబర్ 29 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని కన్నెపల్లి గ్రామానికి చెందిన మగ్గిడి కిషోర్ అనే వ్యక్తి వృత్తిరీత్యా మత్స్యకారుడు గత నాలుగు రోజుల క్రితం స్థానిక గోదావరిలో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మరణించడం జరిగింది.వారి కుటుంబం యొక్క పరిస్థితిని చూసి గ్రామానికి చెందిన అక్కల సుధాకర్ తండ్రి పెద్దయ్య పెద్ద మనసుతో 10,000/- ఆర్థిక సహాయాన్ని కన్నెపల్లి గ్రామస్తుల సమక్షంలో వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి హాజరైన కన్నెపల్లి గ్రామానికి చెందిన పెద్దలు ముత్తే నారాయణ (2500), చుంచు నగేష్ (2500) పెద్ద మనసుతో 5,000/- రూపాయలను మృతుని కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.