సీఎం చెప్పిన విధంగా ప్రభుత్వానికి ఇన్‌కమ్‌ పేంచే విధంగా పని చేస్తారా

రాజకీయ నాయకులకు అధికారులకు లాభాలు వచ్చే విధంగా పని చేస్తారా
బి.సతీష్‌గౌడ్‌
గోషామహల్‌ ప్రజాబలం ప్రతినిధి:జిహెచ్‌ఎంసీ సర్కిల్‌ 14 డిప్యూటీ మున్సిపల్‌ కమీషనర్‌కు ప్రజావాణిలో వినతి పత్రం అందజేసీన గోషామహల్‌ నియోజకవర్గం డెవలప్‌మెంట్‌ అధ్యక్షులు బి.సతీష్‌గౌడ్‌ ఈ సందర్బంగా సీష్‌గౌడ్‌ మాట్లాడుతూ గోషామహల్‌ నియోజకవర్గంలో టాక్స్‌సెక్షన్‌ అధికారులు టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు రాజకీయ పార్టీల తో కలిసి జీహెచ్‌ఎంసీకి రావాల్సిన కలెక్షన్లను రాకుండా ప్రభుత్వానికి వ్యతిరేఖంగా పని చేస్తున్నారు. స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి సెక్రట్రేట్‌లో ప్రభుత్వానికి రావలసిన ఖాజానాను పెంచాలని అధికారులతో సమీక్షాసమావేశంలో ఎన్నోసార్లు చెప్పారు.మున్సిపల్‌ టెక్స్‌ అధికారులు పెద్ద పెద్ద కమర్షియల్‌ ఇండ్లకు సంవత్సరానికి వంద రూపాల పథకాన్ని అమలు చేస్తున్నారు.అలాగే పుత్లీబౌళీ మున్సిపల్‌ కాంప్లెక్స్‌ రెంట్‌కు ఉంటున్న రెంట్‌లు పెంచకుండా ఎంసీహెచ్‌ టాక్స్‌ పెంచకుండా పాత రేట్ల ప్రకారమే వారితో కుమ్మక్కై అధికారులు పాత రేట్ల ప్రకారమే వసూలు చేస్తున్నారు.టౌన్‌ప్లానింగ్‌ అధికారులు రాజకీయ నాయకుల అండదండలతో ఒక ఫ్లోర్‌కు లక్షనుంచి రెండు లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు ప్రజలు అనుకుంటున్నారు. ఇందుకు ప్రజలు చాలా ఉదహరణలు చేపుతున్నారు.మూడు ఫీట్లు ,ఐదు ఫీట్లు ,పది ఫీట్లు ,గల్లీలలో ఐదు నుంచి ఆరు ఫోర్లు బిల్డీంగ్లు కడుతున్నారు.ఎవరైనా కంప్లైట్‌ ఇస్తే బెదిరింపులకు దిగుతున్నారు.వారిని బిల్డీంగ్‌ కడితే డబ్బులు అడుగుతున్నావని పోలీస్‌ కంప్లైంట్‌ ఇస్తామని ఉల్టా బెదిరిస్తున్నారు.వీరందరిని రాజకీయ అండతో బీల్డర్లు జీహెచ్‌ఎంసీ ఆఫీస్‌ని మేనేజ్‌ చేస్తున్నారు.ఎన్ని సార్లు దిన పత్రికలల్లో కథనాలు వచ్చిన సంబంధిత అధికారులు పట్లీంచుకోవడం లేదు.వంద గజాల స్థలంలో సెల్లార్ల కు పర్మిషన్‌ లేకున్నా దగ్గర ఉండి మరి సెల్లార్లు వేపిస్తున్నారు.వేసిన సెల్లార్లలో పార్కింగ్‌ కు బదులు కమర్షియల్‌గావాడుతున్నారు.ఈ తతంగం సాగించిన అధికారులు ఎక్కడికో ట్రాన్స్‌ఫర్‌ అవుతారు.స్థానిక ప్రజలు ఇబ్బందుల పాలవతున్నారు.ఇప్పటికైనా సీఎం చెప్పిన విధంగా ప్రభుత్వానికి ఇన్‌కమ్‌ పేంచే విధంగా పని చేస్తారా కాంట్రాక్టర్లు చెప్పిన విధంగా రాజకీయ నాయకులకు అధికారులకు లాభాలు వచ్చే విధంగా పని చేసుకుంటారా చూడాలి మరి.

Leave A Reply

Your email address will not be published.

Breaking