డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 03 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని నాగసముద్రం గ్రామంలో గడప గడపకు,ఉపాధి హామీ పథకంలో భాగంగా మట్టి తవ్వుతుండగా వారికి మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ…కొక్కీరాల రఘుపతిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు అందిస్తున్న సేవా కార్యక్రమాలను,కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కార దిశగా పాదయాత్ర సాగినది.సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందుతాయని వివరించినారు. గ్రామంలో ఉపాధి హామీ పథకం పనులు చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి వారి తోటి మాట్లాడగా ప్రస్తుత ప్రభుత్వం ఉపాధి హామీ వేతనాలు ఇవ్వడం లేదని వారు తెలిపారు కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు అందించి ఉపాధి హామీ పథకం ద్వారా వంద రోజుల పని కల్పిస్తూ ఉపాధి కల్పన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్నిదని ఈ మేరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని వారికి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో దండేపల్లి మండల జెడ్ పి టి సి గడ్డం నాగరాణి త్రిమూర్తి స్థానిక సర్పంచ్ అన్నవేని ప్రేమల తిరుపతి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల దుర్గ ప్రసాద్ స్థానిక ఉప సర్పంచ్ దేవ లక్ష్మణ్ మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత మహిళా నాయకురాలు శకుంతల పద్మ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
[17:03, 03/05/2023] Reporter Venu Manchiryal: ఎండ్..