జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని ప్రజల్లో కి కాంగ్రెస్ పార్టీ నాయకులు

 

ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ మార్చి 29 : ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ సూచనల మేరకు మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మరియు డిసిసి అధ్యక్షురాలు సురేఖ అమ్మ ఆదేశానుసారం.ఎమ్మెల్యే నివాసంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం కోసం సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మాజీ కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు మహిళా కాంగ్రెస్ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.ఏప్రిల్ 2వ తేదీ నుండి మంచిర్యాల పట్టణంలో ఉన్న ప్రతి వార్డు లో పాదయాత్ర నిర్వహించి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు సూచించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking